ETV Bharat / city

ప్రయత్నాలు ఫలించేనా.. పోలింగ్​ శాతం పెరిగేనా

హోరాహోరిగా సాగిన బల్దియా ప్రచార పర్వం ముగిసింది. పార్టీల వాగ్దానాలు, నేతల ఆరోపణలకు బ్రేక్‌లు పడ్డాయి. ఇక మిగిలింది మహానగర ఓటర్ల బాధ్యతే. ఎందరో విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులతో కిక్కిరిపోతున్న భాగ్యనగరంలో ఎంత ఓటింగ్‌ నమోదవుతుందనేది... ఇప్పడు ఆసక్తికరం. కారణం.... ఇప్పటి వరకు నిర్వహించిన నగర ఎన్నికల్లో... ఎప్పుడూ పోలింగ్‌ 50 శాతానికి మించకపోవడమే. అవును.. స్మార్ట్‌ నగరంగా, అంతర్జాతీయ స్థాయిలో పరుగులు తీస్తున్న హైదరాబాద్‌లో... ఓటింగ్‌ శాతం ఎప్పుడూ తక్కువే. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సాధారణ రోజుల్లోనే పరిస్థితులు ఇలా ఉంటే.... ఇక ప్రస్తుతం కరోనా, వలసలు వంటి ఎన్నో సమస్యలు నేపథ్యంలో... ఎంత మంది పోలింగ్‌ కేంద్రాలకు వస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.

VOTING %
VOTING %
author img

By

Published : Nov 30, 2020, 9:39 AM IST

తెలంగాణ.. భాగ్యనగరం.. రోజురోజుకు సరిహద్దులు చెరిపేస్తూ విస్తరిస్తున్న మహానగరం. ఇక్కడ దాదాపు కోటిన్నర మంది ప్రజలు నివసిస్తుండగా... ఆ సంఖ్య రానురాను మరింత పెరుగుతోంది. వీరిలో పొట్టకూటి కోసం వచ్చే ప్రజలతో పాటు... ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు... ఎంతో మందికి హైదరాబాద్‌ కలల నగరం. అలాంటి హైదరాబాద్‌లోని 150 డివిజన్ల పరిధిలో.. దాదాపు 74 లక్షల మందికి ఓట్ల హక్కు ఉంది. కానీ... ఓటు వినియోగంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఎన్నో విషయాల్లో.. అంతర్జాతీయంగా దూసుకుపోతున్న భాగ్యనగరంలో... ఏ ఎన్నికల్లోనైనా సరే నిర్లక్ష్యమే తాండవిస్తుంది. ఈ కారణంగానే పోలింగ్‌ 50 శాతానికి మించదు. గతకొన్ని ఎన్నికల పోలింగ్‌ సరళిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తేటతెల్లమవుతుంది.

కేవలం 45 మంది మాత్రమే..

నగరంలో మొత్తం 100 మంది ఓటర్లల్లో కేవలం 45 మంది మాత్రమే పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు. ఈ కారణంగా.. 2002లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 41.22 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2009లో 42.95 శాతం పోలింగ్‌ నమోదవ్వగా... ఆ తర్వాత జరిగిన 2016లోనూ అదే తీరుగా... 45.27 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ వరుస ఎన్నికల్లో ఏనాడు పోలింగ్‌ 50 శాతానికి మించలేదు. ఈ గణాంకాలే నగర ఓటర్ల నిర్లక్ష్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఇక 2016 ఎన్నికలను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే... ఏకంగా 10 డివిజన్లల్లో 20 శాతం కంటే తక్కువ ఓటింగ్‌ నమోదయింది. 18 డివిజన్లల్లో 30 శాతం ఓటింగ్‌ దాటలేదు. ఇక 62 డివిజన్లల్లో....40 శాతం, 47 డివిజన్లలో 50 శాతం లోపు ఓటింగ్‌ జరిగింది. ఇలా హైదరాబాద్‌ నగరపాలక ఎన్నికల ఓటింగ్‌ శాతం..... చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీ మహానగర కార్పొరేషన్ల ఎన్నికలతో పోల్చితే చాలా తక్కువగా నమోదవుతుంది.

యువత దూరం..

ఈ ఎన్నికల్లో మరో కోణం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అదే ఎన్నికలకు యువత దూరంగా ఉండడం. అవును... జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు... మిగతా ఎన్నికలకు నగర యువత దూరంగా ఉంటుంది... తమకు పట్టనట్టు వ్యవహరిస్తుంది. రాజధాని నగరంలో సహజంగానే ఉద్యోగులు, విద్యావంతులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఎక్కువ. కానీ.... యువత నిర్లక్ష్యం కారణంగా.. ఇక్కడే ఓటింగ్ శాతం అత్యల్పంగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇందులోనూ... మధ్యతరగతి, పేదలు నివసిస్తున్న ప్రాంతాలు, బస్తీల్లో ఓటింగ్ ఎక్కువగా నమోదవుతుండగా... విద్యావంతులు, ధనవంతులుకు కేంద్రాలుగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్‌ చాలా తక్కువగా ఉంటుంది.

పేదలు, రోజు కూలీలకు వెళ్లే వాళ్లతో పాటు... వయస్సు మీద పడి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు సైతం.... ఎన్నికల రోజు పోలింగ్‌ కేంద్రాలకు వరుస కడుతుండగా... ఓటు హక్కు విలువ తెలిసిన విద్యావంతులు, ఉద్యోగులు ఓటును వినియోగించుకోక పోవడం దురదృష్టం. ముఖ్యంగా గ్రేటర్‌లో దాదాపు 6 లక్షల మంది వరకు ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారని ఓ అంచనా... కాగా వీరిలో చాలా మందికి ఓటు ఉంది. కానీ.. వీరిలో కనీసం 10 శాతం మంది కూడా ఓటింగ్‌లో పాల్గొనడం లేదు. ఇక ధనవంతులు ఓటింగ్‌కు వరుసలో నిలుచునేందుకు నిరాశక్తత చూపిస్తున్నారంటున్న విశ్లేషకులు … ఓటు వేయడంలో ఉదాసీనత, నిరాసక్తతో పాటు వ్యక్తిగత, సంస్థాగత కారణాలను సాకులు చూపుతున్నారని విమర్శిస్తున్నారు. తెలియని వాళ్లకు చెప్పాల్సిన వాళ్లే... ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏలా ? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత తగ్గుతుందా..

సాధారణ రోజుల్లోనే అత్యంత తక్కువ ఓటింగ్‌ నమోదవుతున్న బల్దియాలో పోరులో.. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటింగ్‌ శాతం మరింత పడిపోతుందనే ఆందోళనలు పెరిగిపోయాయి. అందుకు... నగరం నుంచి వెల్లువత్తిన వలసలతో తగ్గిపోయిన ఓటర్ల సంఖ్య, కరోనా పరిస్థితులు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. భాగ్యనగరంలో... మిని భారతం. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు లక్షల మంది నివసిస్తున్నారు. కానీ కరోనా కారణంగా... అన్ని రంగాలు కుదేలవడంతో లక్షల మంది ప్రజలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. వీరిలో చాలా మందికి ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఓట్ల కూడా తగ్గిపోవడంతో పోలింగ్‌ మరింత తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వారు నగరానికి వస్తారా..

ఇక చాలా మంది ఉద్యోగులూ... నగరంలో కరోనా విజృంభణ కారణంగా స్వస్థలాలకు వెళ్లిపోయారు. వర్క్​ ఫ్రమ్‌ హోం వెసులుబాటుతో... హైదరాబాద్‌లో పనిచేసే ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 80శాతం మంది నగరాన్ని విడిచివెళ్లారు. ఇలా వివిధ రంగాల్లోని మొత్తం 15 లక్షల మంది ప్రజలు ప్రస్తుతం హైదరాబాద్‌లో లేరని ఓ అంచనా... వీరిలో ఓటు హక్కు ఉన్నవారే అధికం. కొన్ని నెలలగా లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్నా.. నగరానికి తిరిగి వస్తున్న వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వాళ్లంతా...ఇప్పట్లో నగరానికి చేరుకునే పరిస్థితులూ కనిపించడం లేదు.

నగరంలో ప్రస్తుత కరోనా కారణంగా.... వృద్ధులు ఓటింగ్‌కు ఎంత మంది వస్తారనేది తెలియడం లేదు. సాధారణ సమయాల్లో ఓటింగ్‌లో పాల్గొనేందుకు యువత నిరాసక్తత చూపిస్తున్నా... వృద్ధులు పోలింగ్‌ కేంద్రాలకు బారులు తీరేవారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అదీ సాధ్యం కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం పరిస్థితుల్లో బల్దియా ఓటింగ్‌ మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని ముందుగానే గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.... పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. యువతను ప్రోత్సహించేందుకు, వృద్ధులకు పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ అవన్నీ ఫలిస్తాయో? లేదో ?... వేచి చూడాలి.

ఇవీచూడండి: 25న ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.