సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి ఉద్యోగులకు 2 నెలల వేతన బకాయిలను ప్రభుత్వం 6 శాతం వడ్డీతో చెల్లించాలని... ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీజీపీఎఫ్ నిధుల్ని కూడా మళ్లించి ఉద్యోగుల పొట్టగొట్టారని ఆరోపించారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు వచ్చే గ్రాట్యుటీ, పెన్షన్ సొమ్ము కోసం ఆరేడు నెలలు చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోందని మండిప్డడారు.
ప్రభుత్వ ఉద్యోగికి దక్కాల్సిన సరెండర్ సెలవుల సొమ్మును కూడా మింగేస్తున్నారని అశోక్‌బాబు విమర్శించారు. వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పీఆర్సీ, సీపీఎస్, ఎల్టీసీలు, 6 డీఏల అంశాలను పెండింగ్‌లో పెట్టినందుకు సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. వీటిపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ఉద్యోగులను బెదిరించిన పెద్దిరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: