వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ..ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు దగ్గర్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో వాయువ్య బంగాళా ఖాతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వివరించారు. సోమవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురవొచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: ట్విట్టర్లో మహేశ్ అభిమానుల ప్రపంచ రికార్డు