ETV Bharat / city

2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి: మంత్రి పెద్దిరెడ్డి - AP News

జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ మంచినీటి కుళాయి కనెక్షన్​ను అందిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 2024 నాటికి అన్ని జిల్లాల్లోని ప్రాంతాలనూ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో అనుసంధానిస్తామన్నారు. ఇందుకోసం ఈ ఏడాదిలో రూ.7251 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

మంత్రి పెద్దిరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి
author img

By

Published : Jun 15, 2021, 4:14 PM IST

Updated : Jun 15, 2021, 4:56 PM IST

రాష్ట్రంలో 2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జల్ జీవన్ మిషన్​పై ఆయన గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 47శాతం గృహాలకు ఇంటింటి కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగామని, రానున్న రెండేళ్లలో లక్ష్యాన్ని సాధించాల్సిందిగా సూచించారు. ఈ ఏడాది జల్‌జీవన్ మిషన్ ద్వారా రూ.7251 కోట్ల రూపాయల నిధులతో పనులను చేపట్టాలని స్పష్టం చేశారు.

కేంద్ర నిధులు, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ కలిపి వాటర్ గ్రిడ్ ప్రణాళిక పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 83 శాతం ఇంటింటి కుళాయి కనెక్షన్‌లు ఇవ్వాలనేది లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు, 2023 మార్చి నాటికి విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణ, అనంతపురం, కర్నూలు, 2024 మార్చి నాటికి శ్రీకాకుళం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్‌లు అందించాలనే ప్రణాళిక చేసినట్టు మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో అవసరమైన నీటి వసతిని కల్పించాల్సిందిగా మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 వేల జగనన్న కాలనీల లేఅవుట్లు ఉన్నాయని, వాటిలో ఇప్పటి వరకు 3772 లేఅవుట్స్‌కు నీటి సదుపాయం కల్పించామని వివరించారు. జగనన్న కాలనీల్లో నీటి సదుపాయం కోసం చేసే పనులకు బిల్లుల చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం ఉండదని స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్ ద్వారా జల్‌జీవన్ మిషన్ ద్వారా తాగునీటి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, వేసవిలో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాలు, హ్యాబిటేషన్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

శ్రీకాకుళం ఉద్దానం ప్రాంతంలో 700 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ కింద తాగునీటి కల్పనకు చర్యలు చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా నీరందిస్తామని వెల్లడించారు. ఇకపై ఏ ఒక్క ప్రాంతానికీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే పరిస్థితి ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది జల్‌జీవన్ మిషన్ ద్వారా రూ.7251.72 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, దానికి తగిన ప్రణాళికలు లేకపోవటం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల చేసిన సీఎం

Last Updated : Jun 15, 2021, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.