ETV Bharat / city

TUNGABHADRA: తుంగభద్రలో పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం.. ఎన్ని టీఎంసీలంటే? - తుంగభద్ర జలాశయం

TUNGABHADRA: కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్ర జలాశయంలో పూడిక తగ్గడంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు చేరినట్లు సర్వేలో గుర్తించారు. 2008లో నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలో జలాశయం నీటినిల్వ 100.855 టీఎంసీలుగా గుర్తించారు. ఈ మేరకు 5 టీఎంసీలు పెరిగినట్లు అంగీకరించారు.

TUNGABHADRA
TUNGABHADRA
author img

By

Published : Jun 23, 2022, 6:40 AM IST

TUNGABHADRA: కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్ర జలాశయంలో పూడిక తగ్గడంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు చేరినట్లు సర్వేలో గుర్తించారు. అంతకు ముందు అంటే 2008లో నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలో జలాశయం నీటినిల్వ 100.855 టీఎంసీలుగా గుర్తించారు. అప్పటి నుంచీ ఆ మేరకే నీటి పంపకం జరిగేది. అయితే ఈ ఏడాది మేలో హైదరాబాద్‌లో జరిగిన తుంగభద్ర మండలి సమావేశంలో జలాశయం నీటి సామర్థ్యం ఇకపై 105.788 టీఎంసీలని నిర్ధారించారు. అంటే సుమారు ఐదు టీఎంసీలు పెరిగినట్లు అంగీకరించారు. బుధవారం మండలి కార్యదర్శి అధికారికంగా ఇక్కడ వెల్లడించారు. దీంతో ఈ నీటి సంవత్సరం నుంచి కర్ణాటకకు ఇప్పుడున్న వాటాకు అదనంగా మరో 3.22, ఆంధ్రప్రదేశ్‌కు 1.62, తెలంగాణకు 0.16 టీఎంసీల మేర నీటి కేటాయింపు పెరగనుంది. ఇన్నేళ్లు జలాశయంలో నీటిని కర్ణాటకకు- 65.56, ఆంధ్ర-31.36, తెలంగాణ - 3.08 శాతం మేరకు పంపిణీ చేసేవారు. ఇప్పుడు 105.788 టీఎంసీల జలాలను ఇదే నిష్పత్తిలో పంపిణీ చేస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.