Vigilance raids : గుంటూరు జిల్లాలోని నకరికల్లు, దాచేపల్లి, పొన్నూరు, చెరుకుపల్లిలోని పలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెట్ విక్రయాలు పెరిగిపోతుండటంతో అధికారులు దాడులు చేపట్టారు. నిత్యావసర సరుకుల స్టోర్స్, దుకాణాలు, వంట నూనెల గోడౌన్స్, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేసి.. రికార్డ్స్ పరిశీలించారు.
సరుకులు ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా అమ్ముతూ, ప్రమాణాలు సరిగా లేని 18 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా వంటనూనెలు, వంటనూనె గింజలు అక్రమంగా నిల్వ చేసి అధిక రేట్లకు అమ్మితే... తమకు సమాచారము ఇవ్వవలసిందిగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ మాధవ్ రెడ్డి ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: కొబ్బరి బోండాలు తాగారు... డబ్బులు అడిగితే కత్తులు తీశారు!