ప్రకాశం జిల్లాలో రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు చెందిన గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. గత రెండు రోజులుగా సంతమాగులూరు మండలం గురిజేపల్లి వద్ద ఉన్న బ్లాక్ గ్రానైట్ క్వారీల్లో సోదాలు చేస్తున్నారు. వారం క్రితం వరకూ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తాజాగా శిద్దా క్వారీలపై దృష్టి సారించడంపై తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాలో తెదేపా నేతలే లక్ష్యంగా అధికారులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: