ETV Bharat / city

ఉపరాష్ట్రపతికి కామొరోస్​ అత్యున్నత పౌర పురస్కారం

కామొరోస్​ అత్యున్నత పౌరపురస్కారం 'ద ఆర్డర్​ ఆఫ్​ ద గ్రీన్​ క్రెసెంట్' భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందుకున్నారు. 130 కోట్ల మంది భారతీయుల తరఫున వినయపూర్వకంగా ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నానని ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్​ చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
author img

By

Published : Oct 11, 2019, 7:34 PM IST

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కామొరోస్​ అత్యున్నత పౌర పురస్కారం 'ద ఆర్డర్​ ఆఫ్​ ద గ్రీన్​ క్రెసెంట్'​ను అందుకున్నారు. కామొరోస్​ అధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా మొరోనీలో ఈ గౌరవాన్ని స్వీకరించారు.

ఉపరాష్ట్రపతి ట్వీట్
ఉపరాష్ట్రపతి ట్వీట్

ఆనందంగా ఉందంటూ ట్వీట్

కామొరోస్​ అత్యున్నత పౌర పురస్కారం అందుకోవడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.'130 కోట్ల మంది భారతీయుల తరఫున వినయపూర్వకంగా ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నాను. భారత్-కామొరోస్ మైత్రికి గుర్తుగా ఈ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న సంయుక్త లక్ష్యమే మమ్మల్ని కలిపింది. ఇరు దేశాలను కలిపే సముద్రం కూడా ఒక్కటే. సముద్రమంత స్నేహమిది. పరస్పర పురోగతి స్వప్నమిది.' అంటూ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:

జిన్​పింగ్​ కోసం స్పెషల్​ సాంబార్​, హల్వా

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.