ETV Bharat / city

'తెలుగు ప్రజల గుండె తెరపై గొల్లపూడి చిరస్థాయిగా నిలిచిపోతారు' - గొల్లపూడి మృతిపై వెంకయ్య సంతాపం

ఓ సాహితీ విమర్శ గళం మూగబోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషకు గొల్లపూడి మారుతీరావు చేసిన సేవ మరువలేనిదని కొనియాడారు. గొల్లపూడి మృతికి వెంకయ్య సంతాపం తెలిపారు.

Vice president on gollapudi death
గొల్లపూడి మృతిపై ఉపరాష్ట్రపతి సంతాపం
author img

By

Published : Dec 12, 2019, 11:52 PM IST

Vice president on gollapudi death
గొల్లపూడి మారుతీ రావు మృతి బాధాకరమన్న ఉపరాష్ట్రపతి

విలక్షణ రచయిత, విమర్శకుడు, జాతీయభావాలు కలిగిన మానవతావాది, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. రేడియో, నాటకాలు, కథల రచయితగా ఎప్పటికీ తెలుగు ప్రజల మనసుల్లో గొల్లపూడికి ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. గత నెల చెన్నై పర్యటనలో.. గొల్లపూడిని ఆస్పత్రిలో పరామర్శించానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంతలోనే ఆత్మీయుడైన గొల్లపూడి ఇక లేరనే వార్త తెలియడం బాధాకరమని వెంకయ్య అన్నారు. గొల్లపూడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విజ్ఞానం, వినోదం రెండింటినీ సమ్మిళితం చేసి సంధించడం, సంస్కృతి, సంప్రదాయాలను, విలువలను పాటించడం.. తెలుగు భాష మాధుర్యాన్ని కాపాడటంలో మారుతీరావుది విభిన్నమైన శైలి అని.. వెంకయ్య కొనియాడారు. తెలుగు సాహిత్యంపై మారుతీరావు రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్​లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయన్నారు. పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రజల గుండె తెరమీద చిరస్థాయిగా నిలిచిపోతారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.

ఇదీ చదవండి:

'గొల్లపూడి మృతి సాహితీలోకానికి తీరనిలోటు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.