ETV Bharat / city

కేబుల్​ బ్రిడ్జ్​పై ప్రారంభమైన వాహనాల రాకపోకలు - కేబుల్​ బ్రిడ్జ్ తాజా వార్తలు

భాగ్యనగర ఒడిలో మరో మణిహారంగా నిలుస్తున్న తీగల వంతెనపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మాదాపూర్‌ ప్రాంతంలో పద్మవ్యూహంలా మారిన ట్రాఫిక్‌కు.. ఈ వంతెనతో పరిష్కారం లభించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి నగరవాసులకు విహారకేంద్రంగా నిలుస్తోంది.

vehicles-allowed-to-durgam-cheruvu-cable-bridge-from-monday-onwards
కేబుల్​ బ్రిడ్జ్​పై ప్రారంభమైన వాహనాల రాకపోకలు
author img

By

Published : Sep 29, 2020, 8:42 AM IST

కేబుల్​ బ్రిడ్జ్​పై ప్రారంభమైన వాహనాల రాకపోకలు

హైదరాబాద్‌కు మరింత అందం చేకూర్చేలా దుర్గం చెరువుపై ఆధునిక ప‌రిజ్ఞానంతో నిర్మించిన తీగల వంతెన అందుబాటులోకి వచ్చింది. గత శనివారం ప్రారంభమైన ఈ బ్రిడ్జిపై... సోమవారం నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రూ.184 కోట్ల వ్యయంతో 754.38 మీట‌ర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. దీంతో మాదాపూర్‌- జూబ్లీహిల్స్‌ల మ‌ధ్య దూరం చాలా వరకు త‌గ్గింది. మైండ్‌స్పేస్‌, గ‌చ్చిబౌలికి జూబ్లీహిల్స్‌ నుంచి 2 కిలోమీట‌ర్ల వరకు దూరం త‌గ్గింది. పంజాగుట్ట నుంచి నానక్‌రాంగూడ వద్ద బాహ్యవలయ రహదారికి సులభంగా చేరుకునే వీలుంటుంది. గతంలో హైటెక్ సిటీకి వెళ్లాలంటే ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటల సమయం పట్టేదని... వంతెన నిర్మాణంతో ఎంతో సౌకర్యంగా ఉందని వాహనాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటకంగానూ అభివృద్ధి..

ట్రాఫిక్‌ ఇబ్బందులను తీర్చటం కోసమే కాకుండా దుర్గం చెరువు ప్రాంతాన్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేశారు. ప్రతి శని, ఆదివారాల్లో ఈ తీగల వంతెనపైకి వాహ‌నాల‌కు రానీయకుండా.... కాలినడకన పర్యాటకులను మాత్రమే అనుమతిస్తున్నారు. నిర్దేశించిన చోట వాహ‌నాల‌ను పార్కింగ్ చేసుకొని... విహారానికి వెళ్లాల్సి ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి పైన విహరిస్తూ నగర అందాలను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వంతెనపై మొత్తం 40వేల ఎల్​ఈడీ లైట్లను ఏర్పాటు చేసిన అధికారులు.... విద్యుత్‌ కాంతులు విరాజిమ్మేలా తీర్చిదిద్దారు. వారాంతంలో వినోదం కోసం విభిన్న సాంస్క్రతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: ఆ ఛాలెంజ్​లకు దూరంగా ఉండండి : సైబరాబాద్​ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.