ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ద్విచక్ర వాహనం ఒక భాగమైపోయింది. మోటారు వాహనాలకు సంబంధించి అన్ని రకాల సేవల నిమిత్తం ప్రభుత్వం రవాణాశాఖను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎల్‌ఎల్‌ఆర్‌లు, డ్రైవింగ్ లైసెన్సులు జారీ, రెన్యువల్స్, వాహనాల రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ చేస్తారు. వాహనాల జీవిత పన్ను, రవాణా వాహనాలకు త్రైమాసిక పన్ను, వాహనాల ఫిట్‌నెస్ పత్రాల జారీ, తనిఖీలూ రవాణా శాఖే చూస్తుంది. మోటారు వాహనాల చట్ట నిబంధనలను అమలు చేయటంతో పాటు ఉల్లంఘనదారులకు జరిమానాలు విధిస్తుంది.
కొత్తగా వాహనాలు కొన్నపుడు ఆయా వాహనాల డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మిగిలిన సేవలన్నీ మీ సేవ కేంద్రాలతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్‌లలో లభ్యమవుతాయి. ఈ సేవలు పొందేందుకు ప్రభుత్వం నియమిత రుసుములు ఏర్పాటు చేసింది. ఏయే సేవలకు ఎంతెంత చెల్లించాలి? ఏయే పత్రాలు జతచేయాలి? తదితర విషయాలను ఒకసారి చూద్దామా..
ఇదీ చదవండి: నిబంధనలు పాటిస్తారా....జరిమానాలు చెల్లిస్తారా?