మాజీమంత్రి అచ్చెన్నాయుడి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తెదేపానేత వర్ల రామయ్య మండిపడ్డారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విధానం బాధాకరమని తెదేపానేత వర్ల అన్నారు. భార్యకు చెప్పి వస్తానన్నా అనుమతి ఇవ్వకపోవడం కక్ష కాదా అని దుయ్యబట్టారు. విశాఖలోని అనిశా కార్యాలయానికి ఎందుకు తీసుకు వెళ్లలేదని ప్రశ్నించారు. వైద్యపరీక్షలు చేసేందుకు విశాఖకు ఎందుకు తీసుకెళ్లలేదని వర్ల ప్రశ్నించారు. ఎర్రన్నాయుడుపై ఉన్న కోపం, పగ తమ్ముడిపై తీర్చుకున్నారని వర్ల విమర్శించారు. ఎర్రన్నాయుడు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదును ఏం చేశారు అని వర్ల ప్రశ్నించారు.
ఇవీ చదవండి: అరెస్టులకు ఆధారాలున్నాయి.. చర్చకు సిద్ధమా?: పేర్ని నాని