డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం జగన్... తిరుమల శ్రీనివాసుడిని దర్శనం చేసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య తప్పుపట్టారు. తితిదే నిబంధనలు పాటించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని నిలదీశారు. సీఎం అన్యమతస్థుడు కాబట్టి... డిక్లరేషన్ ఇస్తే తప్పేంటని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఇది అడిగితే మంత్రి కొడాలి నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సరైనదని నిలదీశారు. బూతుల మంత్రి కొడాలి నానిని... మంత్రివర్గం నుంచి తొలగించాలని హైందవ సమాజం కోరుతుందన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే తితిదే ఛైర్మన్ ఎందుకు సీఎంని ఆపలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఛైర్మన్ ఒక అసమర్ధుడని ధ్వజమెత్తారు.
'తితిదే నియమాలను పాటించాల్సిన బాధ్యత సీఎంకు లేదా..?' - తిరుమల ఆలయం వివాదం వార్తలు
తిరుమల ఆలయం గురించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై... వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైందవ మతస్థుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.