సీఎం జగన్ ప్రభుత్వంలోని మంత్రులు... సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నించిన తమ పార్టీ నేతపై... మంత్రి కొడాలి నాని స్పందించిన తీరు సిగ్గుపడేలా ఉందన్నారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిందిపోయి... బూతులతో విరుచుకుపడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తెదేపా నేత దేవినేని ఉమాకు... మంత్రి కొడాలి నాని క్షమాపణ చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించే విషయంలో... మంత్రి ధర్మాన కృష్ణదాస్ బూతుల మాట్లాడటంపైనా వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి... కేబినెట్లో చోటు కల్పించానా అని... సీఎం చింతించాలని పేర్కొన్నారు. వైకాపా నేతలు సభ్యత, సంస్కారం నేర్చుకోవాలని... అందుకోసం శిక్షణ తీసుకున్నా తప్పులేదని హితవుపలికారు.
ఇదీ చదవండి : 8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!