పెద్దల సభకు జగన్‌తో సహ నిందితుడిగా ఉన్న మోపిదేవిని ఎంపిక చేశారని రాజ్యసభ తెదేపా అభ్యర్థి వర్లరామయ్య విమర్శించారు. అయోధ్య రామిరెడ్డి మీద దేశవ్యాప్తంగా 10 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. పరిమళ్ నత్వానీ మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని, అంబానీలకు సంబంధించిన వ్యక్తి అని, ఆయనను రాజ్యసభకు పంపుతున్నారని వర్ల ఆక్షేపించారు. వైకాపా ఎమ్మెల్యేలు కేసులు ఉన్న వ్యక్తులకా.. ? లేని వారికా ఓటేసేది నిర్ణయించుకోవాలని అన్నారు. రెండు సీట్లు బీసీలకు ఇచ్చే బదులు ఓ సీటుని ఎస్సీకి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. అయోధ్య రామిరెడ్డి పార్టీకేం చేశాడని ఆయనకు టిక్కెట్ ఇచ్చారని నిలదీశారు. ఎస్సీలకు సీటివ్వాలని ఆ పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు... సీఎంను ఎందుకు అడగలేకపోయారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: ఏపీలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు