'సీఎం జగన్ ఇచ్చిన ప్రతి మాట తప్పారు' - వైకాపా ప్రభుత్వంపై వంగలపూడి అనిత
సీఎం జగన్ ఇచ్చిన ప్రతి మాట తప్పారని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. అమ్మ ఒడి పేరుతో ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకారవేతాలనివ్వడం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి మహిళ బాధపడుతోందని ఆరోపించారు. మెప్మా, యానిమేటర్లు ఎన్ని ధర్నాలు చేసినా సీఎం స్పందించడం లేదన్నారు.