ETV Bharat / city

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ - తితిదే తాజా వార్తలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా 3 వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేసింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న తితిదే....ఈ ఏడాది సర్వదర్శనానికి తిరుపతిలోని స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తితిదే ముమ్మర చర్యలు చేపట్టింది.

Vaikunta dwara darshan at Tirumala temple

author img

By

Published : Dec 24, 2020, 6:01 AM IST

పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించిన తితిదే...సర్వదర్శన టోకెన్లను తిరుపతి వారికే జారీ చేస్తోంది. డిసెంబర్‌ 25 నుంచి జనవరి 3 వరకు రోజుకు పదివేల మంది చొప్పున పది రోజుల పాటు లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొనేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. కిందటేడాది వరకు ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించిన తితిదే... ఈ ఏడాది నుంచి సంప్రదాయాన్ని మారుస్తూ పది రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరవాలని నిర్ణయం తీసుకొంది.

దీంతో వైకుంఠ ద్వారం నుంచి దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వీలు ఏర్పడింది. ఇప్పటికే 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా భక్తులకు అందచేసిన తితిదే.... సర్వదర్శన టోకెన్ల జారీ ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ టోకెన్లు తీసుకొనేందుకు వీలుగా కేంద్రాల్లో బ్యారికేడ్లు ఏర్పాట్లు చేసింది.

ఇతర ప్రాంతాల ప్రజలు రావొద్దు...

కరోనా కారణంగా....సర్వదర్శన టోకెన్ల జారీలో తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లు ఈఓ జవహర్‌ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని 5 ప్రాంతాల్లో 50 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా దృష్ట్యా సర్వదర్శనం టోకెన్లు స్థానికులకే పరిమితం చేశామని...ఇతర ప్రాంతాల ప్రజలెవరూ రావొద్దని కోరారు. వైకుంఠ ద్వారదర్శన టికెట్ల కోసం భక్తులు పొటెత్తారు. రాత్రి పది గంటల నుంచే కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు. లక్ష టికెట్లు పూర్తయ్యే వరకు క్యూలైన్లలో నిలబడిన వారందరికీ పంపిణీ చేయనుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇదీ చదవండి

వైకాపా నాయకుల కన్నుపడ్డ భూమి గల్లంతే: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.