ETV Bharat / city

కొవిడ్‌ ఉద్ధృతి.. 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు!

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న వేళ 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేయాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న వేళ ఈ ప్రతిపాదనను పలు రాష్ట్రాలు కేంద్రం ముందుంచాయి. కాగా మోదీ సర్కారు దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

vaccine for everyone
vaccine for everyone
author img

By

Published : Mar 20, 2021, 1:15 PM IST

దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం సాధారణ ప్రజల్లో 60 ఏళ్లు పైబడినవారికి, 45-59 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే కొవిడ్‌ టీకాలను ఇస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతమున్న పరిమితిని సడలించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన దృశ్య మాధ్యమ సమీక్షలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తీసుకొచ్చాయి. కరోనా వైరస్‌ రెండోదశ దేశమంతటా విస్తరించకముందే.. ముందస్తు చర్యల్లో భాగంగా తాజా ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

తొలిడోసు పొందిన వృద్ధులు 2,41,948 మంది

తెలంగాణ సర్కారు సమాచారం ప్రకారం ఈనెల 18న.. 60 ఏళ్లు పైబడినవారు 19,524 మంది తొలిడోసు పొందగా.. 45-59 ఏళ్ల మధ్యవయస్కుల్లో రోగులు 9,981 మంది టీకాలను స్వీకరించారు. వృద్ధులు 2,41,948 మంది తొలిడోసు పొందారు. తాజాగా మరో 936 మంది వైద్యసిబ్బంది, 817 మంది పోలీసులు, రెవెన్యూ ఇతర ఉద్యోగులు తొలిడోసు టీకాను పొందగా.. మొత్తంగా ఇప్పటి వరకూ తొలిడోసు పొందినవారిలో 2,12,162 మంది వైద్య, 1,06,240 మంది రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో వైద్యసిబ్బంది, పోలీసులు, ఇతర ఉద్యోగులు కలుపుకొని సుమారు 6 లక్షల మంది ఉంటారని అంచనా. 60 ఏళ్లు పైబడినవారు సుమారు 54 లక్షల మంది, 45-59 ఏళ్లు పైబడినవారు 40 లక్షల మంది ఉంటారని వైద్యశాఖ లెక్క చెబుతోంది.

ఇదీ చదవండి: ఎస్​ఈసీ పిటిషన్​ వేరే బెంచ్​కు బదిలీ చేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.