దేశంలో వై-యాక్సిస్ ఆధ్వర్యంలో నడిచే రెండో ఎడ్యుకేషన్ యూఎస్ఏ సెంటర్ను హైదరాబాద్లో వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు అమెరికా కాన్సులేట్ ప్రకటించింది. ఈ కేంద్రంలో నిపుణులు ఉంటారని.. వారు అమెరికాలో విద్య గురించి కచ్చితమైన, తాజా సమాచారం ఇస్తారని కాన్సూల్ జనరల్ జోయల్ రీఫ్ మాన్ వెల్లడించారు.
మరోవైపు నవంబర్ 16 నుంచి 22 వరకు నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీక్లో అమెరికాలో ఉన్నత విద్యపై అవగాహన కల్పించనున్నట్లు హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ తెలిపింది. ఓపెన్ డోర్స్ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019-20లో 2 లక్షల మంది అమెరికాలో చదువుకునేందుకు వెళ్లారని పేర్కొంది. అక్కడ చదువుకునే వారిలో 20 శాతం మంది భారతీయులేనని.. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నట్లు కాన్సులేట్ వెల్లడించింది. గత పది సంవత్సరాల్లో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయిందని తెలిపింది.
దేశంలో వీసా ప్రాసెసింగ్ విషయంలో హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు ఉచిత అడ్వైజరీ సర్వీసులను అందిస్తున్నట్లు కాన్సూల్ జనరల్ జోయల్ రీఫ్ మాన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి