స్థానిక సంస్థల్లో ఖాళీ స్థానాలకు ఈనెల 14, 15, 16 తేదీల్లో నిర్వహించే ఎన్నికల్లో 2021 జనవరి 1 అర్హత తేదీగా అక్టోబరు 11 వరకు నవీకరించిన ఓటర్ల జాబితాలు వినియోగించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అందజేసిన నవీకరించిన ఓటర్ల జాబితాలను పోలింగ్ సందర్భంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశించారు.
ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్
స్థానిక ఎన్నికల్లో ఫిర్యాదుల స్వీకరణకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో కాల్ సెంటర్ (టెలిఫోన్ నం: 0866 2466877), apsec.call-centre@gmail.com ఏర్పాటు చేసినట్లు నీలంసాహ్ని తెలిపారు. తగిన ఆధారాలతో ఫిర్యాదులు నమోదు చేయొచ్చని ప్రజలకు ఆమె సూచించారు. వీటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: