ఈ ఏడాది ఏప్రిల్.. మేలో పుదుచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి... ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2 నెలల క్రితం ప్రత్యేక కార్యక్రమం ద్వారా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి పేర్లను జాబితాలో చేర్చింది. వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని జాబితా నుంచి తొలగించింది. ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో కేంద్రానికి బదిలీ చేయవలసిన వారి వివరాలను మార్చింది. ఇటీవల కాలంలో మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించింది.
పుదుచ్చేరి వ్యాప్తంగా 10,03,681 మంది ఓటర్లు ఉన్నారు. అందులో స్త్రీలు 5,30,828 మంది... పురుషులు 4,72,736 మంది... ఇతరులు 117 మందికి తుది జాబితాలో ఓటుహక్కు దక్కింది.
పుదుచ్చేరిలో భాగమైన యానంలో 37,747 మంది మొత్తం ఓటర్లు ఉన్నారు. అందులో 19,496 మంది స్త్రీలు ...18, 251 మంది పురుషులకు తుది జాబితాలో ఓటు హక్కు లభించింది. యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా... వివిధ పార్టీ నాయకులతో సమావేశమై..ఓటర్ల జాబితా ప్రతులను అందజేశారు.
ఇదీ చదవండి: పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు: దేవినేని