ETV Bharat / city

కారు తెరాసది.. స్టీరింగ్​ ఎంఐఎంది: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

కరోనా సంక్షోభంలో పేదలను మోదీ ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) పేర్కొన్నారు. ప్రధాని ఆవాస్​ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో నిర్వహించిన భాజపా బహిరంగ సభకు స్మృతి ఇరానీ హాజరయ్యారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర(Praja sangrama yatra) నేటితో ముగిసినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
author img

By

Published : Oct 2, 2021, 8:41 PM IST

స్మృతి ఇరానీ

ఎంఐఎం అంటే తెరాసకు భయమని.. ఆ పార్టీ నేత చెప్పినట్లే తెలంగాణ సీఎం కేసీఆర్​ నడుచుకుంటారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) ఎద్దేవా చేశారు. మజ్లిస్​కు భయపడే తెరాస ప్రభుత్వం సెప్టెంబరు 17న విమోచన దినోత్సవం నిర్వహించలేదని ఆరోపించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) పాల్గొన్నారు. తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర(Praja sangrama yatra) ముగిసినట్లు ఆమె ప్రకటించారు. ఆగష్టు 27న భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్​ పాదయాత్ర ప్రారంభించారు. తొలిదశలో 36రోజుల పాటు ఈ యాత్ర సాగింది.

కొన్నేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) ఆరోపించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ. 3వేల భృతి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రధాని ఆవాస్‌ యోజన పథకం కింద పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నామన్ని కేంద్ర మంత్రి(Smriti Irani in Husnabad meeting) .. రాష్ట్రంలో నిరుపేదలకు తెరాస ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పత్తి కొనుగోలు చేసేది కాదని.. మోదీ ప్రభుత్వం 70 వేల కోట్ల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిందని వివరించారు.

కారు తెరాసది స్టీరింగ్​ ఎంఐఎంది. మజ్లిస్​ అధినేత ఎలా చెబితే కేసీఆర్​ అలా నడుచుకుంటారు. కరోనా సంక్షోభంలోనూ దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ ఇచ్చింది. ఉచిత రేషన్‌తో పాటు మహిళలకు డబ్బులు ఇచ్చి ఆదుకుంది. పీఎం ఫసల్‌ బీమా యోజన ద్వారా రైతులకు అండగా నిలిచాం. ఆయుష్మాన్ భారత్‌ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందిస్తున్నాం. కానీ రాష్ట్రంలో నిరుపేదలకు సీఎం కేసీఆర్​ ఏమైనా సాయం చేశారా.?

-స్మృతి ఇరానీ, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి

తెలంగాణ యావత్తు హుజూరాబాద్​ వైపు చూస్తోందని భాజపా నేత ఈటల రాజేందర్​ తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఈటల పాల్గొన్నారు. హుజూరాబాద్​లో ఐదు నెలలుగా డా.అంబేడ్కర్​ రచించిన రాజ్యాంగానికి బదులు.. కేసీఆర్​ రాసుకున్న రాజ్యాంగం అమలవుతోంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక ఉపఎన్నిక కోసం ఇన్ని వేల కోట్ల ​జీవోలు ఇచ్చి, ఇన్ని రకాల ప్రలోభాలకు గురి చేయటం ఇదే మొదటిసారని ధ్వజమెత్తారు.

ధర్మమే గెలుస్తుంది..

"ఒక్కడి ముఖం అసెంబ్లీలో కనిపించకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలు జారీ చేస్తే.. ఆయన బానిసలు చాలా మంది వాటిని అమలు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. వందల కోట్లతో మనుషులకు విలువకట్టే ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్​ 30న హుజూరాబాద్​లో కురుక్షేత్ర యుద్ధం చివరి దశ. ఈ యుద్ధం కేసీఆర్​ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి జరుగుతోంది. ఈ యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది. ప్రజలే గెలుస్తారు. పద్దెనిమిదేళ్లలో ఉద్యమకారునిగా, ఎమ్మెల్యేగా, ఫ్లోర్​ లీడర్​గా, మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది. దాన్ని చెరిపేసే సత్తా.. కేసీఆర్​కే కాదు.. ఆయన జేజమ్మ వాళ్ల కూడా కాదు." - ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ భాజపా అభ్యర్థి

ఇదీచదవండి: Ministers Fires On Pawan: 'పవన్​ ఆరాటం ప్యాకేజీల కోసమే.. ప్రజల కోసం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.