ETV Bharat / city

నేడే ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో ఏర్పాట్లు - Umamaheswari Funerals at mahaprasthanam

Umamaheswari Funerals: దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి అంత్యక్రియలను నేడు మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు ఎన్టీ రామారావు కుటుంబసభ్యులు ప్రకటించారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఆమె భర్తతో కలిసి ఉంటున్నారు. ఆమె వచ్చేవరకు అంత్యక్రియలు ఆపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నేటి ఉదయం విశాల నగరానికి వచ్చేస్తారని ఆ తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

Umamaheswari Funerals
Umamaheswari Funerals
author img

By

Published : Aug 3, 2022, 7:42 AM IST

Umamaheswari : మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (57) సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉమామహేశ్వరి అంత్యక్రియలను(Umamaheswari Funerals) నేడు మహాప్రస్తానంలో నిర్వహించనున్నట్లు ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. తమ గారాలపట్టి.. ముద్దుల చెల్లి ఉమా మహేశ్వరి స్వర్గస్తులవ్వడం బాధాకరమని రామకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిందని ఉద్వేగానికిలోనయ్యారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఆమె భర్తతో కలిసి ఉంటున్నారని.. విశాల కడసారి తన తల్లిని చూసుకునేందుకే అంత్యక్రియలను ఆపినట్లు తెలిపారు. ఆమె రాగానే అంత్యక్రియల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.

ఉమా మహేశ్వరి పార్థీవ దేహానికి మంత్రులు తలసానిశ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు నివాళులు అర్పించారు. ఉమా మహేశ్వరి చనిపోవడం బాధాకరమని ఎన్టీఆర్​ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని మంత్రులు పేర్కొన్నారు. చిన్న కూతురు అంటే ఎన్టీఆర్​కు అత్యంత ఇష్టమన్నారు. దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు.

కంఠమనేని ఉమా మహేశ్వరి పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా జూబ్లీహిల్స్​లోని ఆమె ఇంటికి తరలివచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలు వచ్చారు. గారపాటి లోకేశ్వరి కుమారుడితో కలిసి రాగా... అనంతరం నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, కళ్యాణ్ రామ్, నారా భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.