ETV Bharat / city

Kondapur septic tank incident : సెప్టిక్‌ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి

author img

By

Published : Nov 28, 2021, 2:11 PM IST

Two Workers died while cleaning septic tank తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు.

సెప్టిక్‌ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి

Two Workers died while cleaning septic tank : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఇద్దరు కూలీలు దిగగా... కాసేపటి తర్వాత వారికి ఊపిరాడక అందులోనే చనిపోయారు. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

ఉద్రిక్తత

మృతి చెందిన కూలీలు ప్రైవేట్ సంస్థ అయిన "డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్" తరఫు నుంచి వచ్చిన సిబ్బంది అంజి (30), శ్రీను(32)గా గుర్తించారు. మృతులు సైదాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నట్ల సమాచారం. మాదాపూర్ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి... మృతదేహాలను వెలికి తీశారు. బయటకు తీసిన మృతదేహాలను తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా... కుటుంబసభ్యులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మృతులను నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ఘాజీనగర్‌ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: 'జల్‌జీవన్‌ మిషన్‌ అసలు లక్ష్యం అదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.