ETV Bharat / city

గోదావరి-బనకచర్లకు రెండు మార్గాలు..! - గోదావరి-బనకచర్లకు రెండు మార్గాలపై కసరత్తు

గోదావరి వరద జలాలను బనకచర్లకు మళ్లించే ప్రాజెక్టుపై జలవనరులశాఖ కసరత్తు సాగిస్తోంది. తాజాగా ఇందుకు రెండు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి జలాలను బనకచర్ల కాంప్లెక్సు వద్దకు తరలించేందుకు వీలుగా ప్రాజెక్టు నివేదికలపై దృష్టి సారించింది.

Two ways for Godavari water to turn to Banakacharla
గోదావరి-బనకచర్లకు రెండు మార్గాలు..!
author img

By

Published : Oct 22, 2020, 10:26 AM IST

గోదావరి వరద జలాలను బనకచర్లకు మళ్లించే ప్రాజెక్టుపై జలవనరులశాఖ కసరత్తు సాగిస్తోంది. తాజాగా ఇందుకు రెండు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గతంలో గోదావరి పెన్నా అనుసంధానం చేపట్టాలని కసరత్తు సాగించారు. వ్యాప్కోస్‌ అధ్యయనం చేసి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తర్వాత తెలంగాణతో కలిసి గోదావరి జలాలను శ్రీశైలానికి మళ్లించేందుకు వీలుగా రెండు రాష్ట్రాల అధికారులు కొంత కసరత్తు చేసినా, తర్వాత అది ఆగిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి జలాలను బనకచర్ల కాంప్లెక్సు వద్దకు తరలించేందుకు వీలుగా ప్రాజెక్టు నివేదికలపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు పూర్తిగా ఏపీ భూభాగంలోనే సాగుతుంది. మధ్యలో బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తారు. అక్కడి నుంచి వెలిగోడు జలాశయానికి నీటిని తరలించేలా కొత్త ప్రతిపాదనలు రూపొందాయి. ఇందుకు మొత్తం మూడు ప్యాకేజీలుగా రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.

పోలవరం నుంచి ఎత్తిపోతా? టన్నెళ్ల ద్వారానా..? (మొదటి ప్యాకేజీ)
* మొత్తం 3 ప్యాకేజీలుగా ప్రతిపాదనలు సిద్ధమైనా రెండు ప్రతిపాదనల్లోనూ మొదటి ప్యాకేజీలోనే మార్పు ఉంటుంది. మిగిలిన రెండు ప్యాకేజీల్లో మార్పు లేకుండా ఒకే మార్గంగా ప్రతిపాదించారు.
* రెండు ప్రతిపాదనల్లోనూ పోలవరం జలాశయం నుంచే నీటిని తీసుకోవాలి. నీటి మళ్లింపు మార్గాలు వేర్వేరుగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

మొదటి ప్రతిపాదన
పోలవరం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోస్తారు. + 32 మీటర్ల స్థాయి నుంచి + 72 మీటర్ల స్థాయికి నీటిని లిఫ్టు చేయాలి. తర్వాత మార్గమధ్యంలో కొవ్వాడ వద్ద మరో ఎత్తిపోతల అవసరమవుతుందని, అక్కడ దాదాపు 100 మీటర్లకు నీటిని ఎత్తిపోయాలని చెబుతున్నారు. ఈ మార్గంలో పోలవరం నుంచి కృష్ణా నది వరకు దాదాపు 180 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాలి.

రెండో ప్రతిపాదన
ఈ విధానంలో పోలవరం కుడివైపున ఉన్న రెండు టన్నెళ్ల సామర్థ్యం పెంచుతారు. దాదాపు 50వేల క్యూసెక్కులు ఈ రెండు టన్నెళ్ల ద్వారా తీసుకొస్తూ ప్రస్తుతం ఉన్న పోలవరం కుడి కాలువను వెడల్పు చేస్తారు. ఆ నీటిని తీసుకొచ్చి ప్రస్తుతం పవిత్ర సంగమం వద్ద ప్రకాశం బ్యారేజిలో కలుపుతారు.

2వ ప్యాకేజీ ఎలా?
రెండో ప్యాకేజీ దాదాపు గతంలో ఉన్నట్లుగానే కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని ఎత్తిపోస్తారు. సాగర్‌ కుడికాలువ 80వ కిలోమీటరు వద్ద కలుపుతారు. అక్కడి నుంచి బొల్లాపల్లి జలాశయానికి నీటిని ఎత్తిపోస్తారు. బొల్లాపల్లి వద్ద కొత్త జలాశయం నిర్మించాలి.

బొల్లాపల్లి నుంచి వెలిగోడుకు ఇలా.. (మూడో ప్యాకేజీ)
బొల్లాపల్లి జలాశయంలో గోదావరి వరదనీటిని నిల్వచేసి అక్కడి నుంచి బనకచర్ల కాంప్లెక్సు వద్దకు తీసుకువెళ్లాలనేది తాజా ప్రణాళిక. ఈ విధానంలో బొల్లాపల్లి జలాశయం నుంచి వెలిగొండ జలాశయం వరకు 90 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ తవ్వాలి. తర్వాత నల్లమల సాగర్‌ నుంచి మహదేవపురం వరకు నీటిని 25 కిలోమీటర్లకు పైగా మళ్లించాలి. తర్వాత అక్కడి నుంచి వెలిగోడు జలాశయానికి తీసుకువెళ్తారు.

ఏది మేలు? ఏది ఖర్చు తక్కువ?
ఈ రెండు ప్రతిపాదనల్లో మొదటి ప్యాకేజీలోనే అంచనా వ్యయం, నీటి మళ్లింపు మార్గం, ఇతరత్రా తేడాలు ఉన్నాయి తప్ప మిగిలిన రెండు ప్యాకేజీల్లో మార్పులేమీ లేవని చెబుతున్నారు. అదే సమయంలో పోలవరం టన్నెళ్ల సామర్థ్యం పెంచి నీళ్లు తీసుకొచ్చే ప్రతిపాదనల ప్రకారం పనిచేస్తే దాదాపు రూ.65 వేల కోట్లతోనే పూర్తి చేయవచ్చని చెబుతున్నారు. అదే రెండో ప్రతిపాదనలో రూ.75వేల కోట్ల వరకు ఖర్చవుతుందని లెక్కించినట్లు చెబుతున్నారు. భూసేకరణ విషయంలోనూ పోలవరం టన్నెళ్ల ద్వారా నీళ్లు మళ్లించే ప్రతిపాదనే మేలని పేర్కొంటున్నారు.
మరోవైపు పోలవరం టన్నెళ్ల సామర్థ్యం పెంపు, కుడికాలువ వెడల్పు పనుల ప్రతిపాదనలు కేంద్ర ఆకృతుల సంస్థకు చేరాయి. అక్కడ పరిశీలన సాగుతోంది. సాంకేతికంగాను, పోలవరం అథారిటీ అనుమతుల విషయంలో ఎదురయ్యే ఇబ్బందులపైనా చర్చ సాగుతోంది. చివరకు ఏ ప్రతిపాదన వైపు మొగ్గుచూపుతారో చూడాలి.

ఇదీ చదవండి:

గ్రామీణ ప్రాంతాల పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.