ETV Bharat / city

గుంటూరు రేప్ కేస్: మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు! - rape attempt on engineering student in guntur

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు ఇంజినీరింగ్ విద్యార్థిని రేప్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

guntur engineering student rape case
guntur engineering student rape case
author img

By

Published : Jul 4, 2020, 9:57 PM IST

గుంటూరు ఇంజినీరింగ్ విద్యార్థిని అసభ్యంగా చిత్రించి, ఆపై అత్యాచారం చేసిన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే వరుణ్, కౌశిక్​ అరెస్ట్ అయ్యారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దర్ని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.

వీరిలో ఒక యువకుడు అసభ్య చిత్రాలను ఇన్​స్టాగ్రాంలో అప్​లోడ్ చేసినట్లు.. మై నేమ్​ ఈజ్ 420 పేరుతో ఖాతా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతా నిర్వాహకుడు తనకు తెలిసిన వారికి ఆ చిత్రాలు పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయంలో అతనికి సహకరించిన మరో విద్యార్థిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు చూపించి విద్యార్థిని నుంచి డబ్బులు కూడా వసూలు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.

సంబంధిత కథనం:

మూడేళ్లు చిత్రవధ... నగ్న దృశ్యాలతో యువతికి వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.