Gang Rape of a Minor Girl in Nellikuduru: 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇటీవలే.. ప్రభుత్వ విద్యాసంస్థలో 6 వ తరగతిలో ప్రవేశం పొందింది. కాగా.. బాలికపై ఇద్దరు మైనర్ బాలురు, ఓ వ్యక్తి కలిసి కొద్ది నెలల కిందట అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలిసింది.
విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలిని మహబూబాబాద్‌లోని బాలికల సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఈ విషయంపై నెల్లికుదురు పోలీసులను వివరణ కోరగా సమాధానం దాటవేశారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి..