తెలుగు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు ఉన్నట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డెల్టా ప్లస్ కేసులపై లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. తెలంగాణలో 2, ఏపీలో 2 డెల్టా ప్లస్ కేసులు ఉన్నట్టు స్పష్టం చేసింది. దేశంలో ఈ నెల 23 వరకు 70 డెల్టా ప్లస్ కేసులు నమోదు కాగా అందులో ఏపీ, తెలంగాణలో రెండేసి కేసులు ఉన్నట్టు పేర్కొంది.
డెల్టా ప్లస్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 23 నమోదు కాగా.. ఆ తరువాత మధ్య ప్రదేశ్‌లో 11 కేసులు ఉన్నాయని సమాధానం ఇచ్చింది. వైరస్‌లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు గాను ఇన్సకాగ్ని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో సభ్యులుగా ఉన్న ల్యాబ్‌లు ఎప్పటికప్పుడు వైరస్ జినోమ్ సీక్వెన్స్ చేస్తాయని ప్రకటించింది.
ఇదీ చదవండి: Corona third wave alert: 'ఆగస్టు 31 నాటికి ఆక్సిజన్ జనరేటర్లు సిద్ధం చేసుకోవాలి'