తెలుగుదేశం నేత నారా లోకేశ్, గుంటూరు అర్బన్ ఎస్పీ... ట్విట్టర్ వేదికగా పరస్పర ఆరోపణలకు దిగారు. పొన్నూరులో ఎమ్మెల్యేను ఉద్దేశించి తెలుగుదేశం కార్యకర్త మణిరత్నం సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టడంపై అతన్ని అరెస్ట్ చేశారు. ఈ విషయమై నారా లోకేశ్ ట్విట్టర్‌లో స్పందించారు. మణిరత్నం పెట్టిన పోస్టులో తప్పేంటో పోలీసులు తెలపాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతలు ఆడమన్నట్లు పోలీసులు అడుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
లోకేశ్ వ్యాఖ్యలపై గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి స్పందించారు. అసత్య వార్తలు ప్రచారం చేస్తే లోకేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై మళ్లీ స్పందించిన లోకేశ్.. పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని సవాల్ విసిరారు. మణిరత్నం పెదకాకాని పోలీస్‌స్టేషన్ నుంచి విడుదలైన ఫొటోలను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: