ETV Bharat / city

అన్న మృతదేహాన్ని రప్పించాలంటూ.. కేటీఆర్​కు ట్వీట్​! - Details of Sridhar's death in America

"కేటీఆర్ సార్​.. మా అన్నయ్య అమెరికాలో మృతి చెందాడు. మృతదేహాన్ని రప్పించేందుకు తెలంగాణ, భారత ప్రభుత్వం చర్యలు తీసుకోండి" అంటూ ఓ మహిళ తెలంగాణ మంత్రి కేటీఆర్​కు ట్వీట్​ చేసింది. కేంద్రమంత్రి కిషన్​రెడ్డికి సైతం స్థానిక భాజపా నేతల ద్వారా సమాచారం అందించింది.

tweet to KTR
కేటీఆర్​కు ట్వీట్​
author img

By

Published : Dec 3, 2020, 1:52 PM IST

ఉద్యోగం నిమిత్తం అమెరికాలో నివాసముంటున్న తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా మేడిపల్లి వాసి.. పానుగంటి శ్రీధర్​ అనారోగ్యంతో అక్కడే మృతి చెందారు. ఈ మేరకు బుధవారం ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. గత నెల 27న అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన శ్రీధర్​.. చికిత్స పొందుతూ ఈనెల 1న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు తెలంగాణ, భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ చెల్లెలు కవిత కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్​ ద్వారా, కేంద్ర హొం‌ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డికి స్థానిక భాజపా నేతల ద్వారా విజ్ఞప్తి చేశామని కవిత తెలిపారు.

ఇవీ చూడండి:

కార్మికుల మధ్య ఘర్షణ... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.