ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా పడటంపై కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శలు చేశారు. వాయిదాలతో ప్రభుత్వం అభాసుపాలైందని ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీ హయాం నుంచి గత ప్రభుత్వాలు కొన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాయని, ఇళ్లు కూడా కట్టించాయని గుర్తు చేశారు. ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఈ కార్యక్రమాలు జరిగాయన్నారు.
పరిపాలనా రాహిత్యానికి, చేతగాని తనానికి ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా నిలువుటద్దమని తులసిరెడ్డి విమర్శించారు. అడుసు తొక్కనేల - కాలు కడగనేల అన్నట్లు ముందు తేదీ ప్రకటించడం, మళ్లీ తేదీ మార్చడం ఎందుకని నిలదీశారు. తాగను చేతగాని పిల్లి... పాత్రలోని పాలను ఒలక పోసినట్లుందనే విధంగా వైకాపా పాలన ఉందని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: