ETV Bharat / city

టీఎస్ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎట్టకేలకు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని సున్నితంగా ముగించింది సర్కారు. టీఎస్ఆర్టీసీ సంస్థకు తక్షణమే రూ.100 కోట్ల ఆర్థికసాయంతో పాటు కిలోమీటర్​కు 20 పైసల చొప్పున సోమవారం నుంచి బస్సు ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. సింగరేణి తరహాలో కార్మికులే లాభాలు పంచుకునేలా ఆర్టీసీని అద్భుత సంస్థగా తీర్చిదిద్దుతానని తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

tsrtc-strike-ended-with-cm-kcr-statement
టీఎస్ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
author img

By

Published : Nov 29, 2019, 6:30 AM IST

దాదాపు రెండు నెలలుగా టీఎస్ఆర్టీసీకి సంబంధించి నెలకొన్న అనిశ్చితికి తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రకటనతో తెరపడింది. హైదరాబాద్​లోని ప్రగతిభవన్ వేదికగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్... ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. తాము ఎవరి పొట్టలు కొట్టదల్చుకోలేదని సీఎం కేసీఆర్​ వ్యాఖ్యానించారు. గతంలోనే విజ్ఞప్తి చేసినా... యూనియన్ల మాటలు విని కార్మికులు నష్టపోయారని కేసీఆర్​ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని కోరిన సీఎం... కార్మికులు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు. ఆ రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి... ఆర్థికసాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

క్రమశిక్షణా రాహిత్యాన్ని సహిచం....

ప్రభుత్వ నిర్ణయాన్ని అలుసుగా తీసుకుని క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తే కార్మికులు మళ్లీ ఇబ్బందుల్లో పడతారని కేసీఆర్​ హెచ్చరించారు. కార్మికసంఘాలను పక్కనపెట్టి తాను చెప్పినట్లు వింటే ఆర్టీసీని అద్భుత సంస్థగా తీర్చిదిద్దుతాననని ప్రకటించారు. సింగరేణి తరహాలో లాభాలు పంచుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రస్తుత నిర్ణయంతో ఆర్టీసీ సమస్య సుఖాంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి... సంస్థకు తక్షణ సాయంగా రూ. 100 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు సంస్థకు అదనపు ఆదాయం వచ్చేందుకు వీలుగా ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి కిలోమీటర్ కు 20 పైసల చొప్పున ఛార్జీలు పెంచుకోవచ్చని తెలిపారు.

విపక్షాలు, యూనియన్లది అత్యుత్సాహం...

కార్మికసంఘాలు, విపక్షాల వైఖరిని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. కార్మికులను యూనియన్లు అనవసరంగా రోడ్డు పాలు జేస్తే, వాస్తవాలు చెప్పాల్సిన ప్రతిపక్షాలు... నాలుగు ఓట్ల కోసం రాజకీయ చలిమంటలు వేశాయని మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే కార్మికుల గురించి ఆలోచించారన్నారు.

లాభాల బాటలో పయనించేలా నిర్ణయాలు...

లాభాల బాటలో పయనించేలా ఆర్టీసీని అద్భుత సంస్థగా తీర్చిదిద్దేందుకు ఉమ్మడి నిర్ణయాలు తీసుకుందామని కేసీఆర్​ తెలిపారు. త్వరలోనే ప్రతి డిపో నుంచి ఐదారుగురిని పిలిపించి తానే మాట్లాడతానని చెప్పారు. ఆర్టీసీ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కార్మికులందరికీ ముద్రించి ఇస్తామని తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కూడా అవసరమన్న కేసీఆర్... ఇందుకోసం సీనియర్ మంత్రి నేతృత్వంలో కార్మికుల సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సమ్మె సందర్భంగా తాత్కాలిక విధులు నిర్వర్తించిన వారికి సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్​లో వారి గురించి ఆలోచిస్తామని కేసీఆర్​ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది

TG_Hyd_74_25_All Party's Round Table On Govt School's_Pkg_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) రాష్ట్రంలోని 12 వేల పాఠశాలలను మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని అఖిల పక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాఠశాలలు మూసివేస్తానని చెప్పే అధికారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదన్నారు. పాఠశాలల మూసివేత వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విద్యకు దూరమయ్యో పరిస్థినెలకొంటుందని... మూసివేసే ప్రభుత్వ యోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. Look.... V. O 1: హైదరాబాద్ బషీర్ బాగ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో... 'రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ బడుల మూసివేతను అడ్డుకుంటాం' అనే అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల్లో కేజీ టూ పీజీ ఉచిత విద్యా అని హామీలు ఇచ్చి... ప్రభుత్వ విద్యాను నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, వ్యాయామ, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను తీర్చాలని ఆయన కోరారు. విద్యాను వ్యాపారం చేసేందుకు కేసీఆర్ పునాదులు వేస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని... ఆర్టీసీ మాదిరిగానే ప్రభుత్వ స్కూల్స్ ఆస్తులను అమ్ముకునేందుకు ఈ చర్యకు దిగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు , మేధావులు , ఉద్యోగ సంఘాలు , ప్రజా సంఘాలు ప్రభుత్వ చర్యను వ్యతిరేకించాలని కోరారు. పోరాటాలు చెయ్యకపోతే మరో నిజాం పాలనలో బానిసత్వంగా బతకాలని అన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లలో మౌళిక సదుపాయాలు కల్పించకుండా... విద్యా ప్రమాణాలు లేవని మూసివేయాలని చూస్తే... ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ బడులను మూసివేయడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ డిమాండ్ చేశారు. బైట్: వి. హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత బైట్: ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బైట్: ఆచార్య కోదండరామ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.