Medicines Delivery by Drone: అందరికీ అన్నివేళలా మందులు అనేవి దొరకవు. ఒకవేళ దొరికినా సరే నడుచుకొని వెళ్లాలి.. దీనివల్ల సమయం వృథా అవుతుంది. అదే అత్యవసర పరిస్థితి వస్తే ఇంక చెప్పాల్సిన పనే లేదు. వీటి అన్నింటిని గమనించిన ఒక స్టార్టప్ కంపెనీ.. ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించింది. అందుకోసం డ్రోన్ ద్వారా మందులను పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ఔషధాలను సరఫరా చేసేందుకు డ్రోన్లను వినియోగించుకుంటే వేగంగా, సులభంగా చేరుకోవచ్చనే ఓ ఆలోచనకు వచ్చారు. అనుకున్నదే తడవుగా ప్రయత్నం చేసి.. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. టీ శాట్- మెడికార్డ్ స్టార్టప్ కంపెనీ ఆధ్వర్యంలో మందుల పంపిణీ జరిగింది.
తొలి ప్రయత్నంలోనే విజయం.. సాధారణంగా నిర్మల్ నుంచి నిజామాబాద్ వెళ్లాలంటే సుమారు గంటన్నర సమయం పడుతోంది. అలాంటిది అరగంట కన్నా తక్కువ సమయంలోనే ఇవి నిర్ణీత ప్రదేశానికి చేరుకోవడం విశేషం. అదీ తొలి ప్రయత్నంగా నిజామాబాద్ నుంచి నిర్మల్‌కు సోమవారం మందులను సరఫరా చేశారు. పట్టణంలోని జి.కె. ప్రశాంత్ ఆసుపత్రి వైద్యుడు ప్రశాంత్ వీటిని స్వీకరించారు. ఇది విజయం సాధించడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేశారు. తొందరలోనే అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
ఎలా పని చేస్తోంది.. ఈ డ్రోన్ పూర్తిగా శాటిలైట్ ఆధారంగా పనిచేస్తోంది. అందులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఎక్కడకు చేరుకోవాలో, ఎలా చేరుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారు. క్యూఆర్ కోడ్ వివరాల ఆధారంగా నిర్ణయించిన ప్రాంతానికి మందులను సరఫరా చేస్తోంది. భూమికి నుంచి 400 అడుగులు ఎత్తులో ప్రయాణిస్తోంది. 60 మీటర్ల దూరం నుంచే క్యూఆర్ కోడ్‌ను రీడ్ చేసి అక్కడకు చేరుకుంటోంది. ప్రస్తుతం 2 కిలోల బరువైన మందులను సరఫరా చేసేందుకు సులభంగా ఉందని ఆసుపత్రి వైద్యుడు ప్రశాంత్ తెలిపారు. బిజినెస్ టు బిజినెస్ పద్ధతిలో సదరు సంస్థ నిర్వాహకులు మందులను సరఫరా చేస్తారన్నారు. ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు, తక్కువ సమయంలోనే మందులు తీసుకొచ్చేందుకు ఈ విధానం ఉపయోగపడుతోందని చెప్పారు. డ్రోన్ ద్వారా ఆసుపత్రికి మందులను సరఫరా చేయడం దేశంలోనే తొలిసారని అన్నారు.
ట్విటర్ ద్వారా కేటీఆర్ అభినందనలు.. తొలిసారిగా నిజామాబాద్ నుంచి నిర్మల్‌కు తొలిసారిగా డ్రోన్ సాయంతో ఔషధాల తరలింపుపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఔషధాలు సరఫరా చేయడం సంతోషకరమన్నారు. ఈ మేరకు మంత్రి ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రాజెక్టు మెడిసిన్ ఫ్రం ద స్కైలో తెలంగాణ ముందు ఉండడం గర్వకారణమని స్పష్టం చేశారు. సమాజానికి ఉపయోగపడని, మేలు చేయని సాంకేతికలు ఎందుకు ఉపయోగపడదని ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు పదేపదే చెబుతుంటారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
-
Any technology that doesn’t have a positive societal impact is futile is what CM KCR Garu reminds us all the time
— KTR (@KTRTRS) September 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Was happy to see Drones being used to airlift medicines from Nizamabad to Nirmal
Proud that #Telangana was the pioneer in the Medicine from the Sky project of @wef pic.twitter.com/XVFGj9EnqI
">Any technology that doesn’t have a positive societal impact is futile is what CM KCR Garu reminds us all the time
— KTR (@KTRTRS) September 27, 2022
Was happy to see Drones being used to airlift medicines from Nizamabad to Nirmal
Proud that #Telangana was the pioneer in the Medicine from the Sky project of @wef pic.twitter.com/XVFGj9EnqIAny technology that doesn’t have a positive societal impact is futile is what CM KCR Garu reminds us all the time
— KTR (@KTRTRS) September 27, 2022
Was happy to see Drones being used to airlift medicines from Nizamabad to Nirmal
Proud that #Telangana was the pioneer in the Medicine from the Sky project of @wef pic.twitter.com/XVFGj9EnqI
ఇవీ చదవండి: