ETV Bharat / city

కస్టోడియల్ మరణంపై న్యాయవిచారణకు.. తెలంగాణ హైకోర్టు ఆదేశం - high court hearing on addaguduru custodial death

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడు కస్టోడియల్ మృతిపై న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న మరియమ్మ అనుమానాస్పద మృతిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ts high court
తెలంగాణ హైకోర్టు
author img

By

Published : Jun 24, 2021, 7:38 PM IST

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడు కస్టోడియల్ మృతిపై న్యాయవిచారణకు హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ మృతిపై న్యాయవిచారణ జరిపి వారం రోజుల్లో సీల్డ్​కవర్​లో నివేదిక సమర్పించాలని ఆలేరు మేజిస్ట్రేట్​ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అవసరమైతే.. మరియమ్మ మృతదేహాన్ని వెలికి తీసి రీ-పోస్టుమార్టం జరపాలని స్పష్టం చేసింది.

వెల్లువెత్తిన ఆరోపణలు..

దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న మరియమ్మ అనుమానాస్పద మృతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. మరియమ్మ పోలీసుల వేధింపుల వల్లే మరణించారని.. న్యాయ విచారణ జరపాలని కోరుతూ పీయూసీఎల్ ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. మరియమ్మ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి ఏసీపీతో విచారణ జరుపుతున్నట్లు, పోలీసులు వేధించలేదని.. పోస్టుమార్టంను వీడియో చిత్రీకరించామని వివరించారు.

సీసీ కెమెరాలు ఎందుకు లేవు?

పోలీసుస్టేషన్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కస్టోడియల్ మృతిపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆలేరు మేజిస్ట్రేట్​ను ఆదేశిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

సీఎంను ఘనంగా సత్కరించిన 'క్షత్రియ' నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.