తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్న పురపాలక ఎన్నికల్లో తెరాస విజయదుందుభి మోగిస్తోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో కారు జోరు సాగుతోంది.
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో తెరాస మెజార్టీ కొనసాగిస్తున్నందున తెలంగాణ భవన్లో గులాబీ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయానికిపెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. బాణాసంచా కాల్చి ఆనందోత్సవాల్లో మునిగితేలారు.