ETV Bharat / city

తెలంగాణలో రాకేశ్‌​ అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత.. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై దాడి - Rakesh funerals in warangal district

అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన అల్లర్లలో మృతి చెందిన తెలంగాణ యువకుడి మృతదేహంతో భారీ ర్యాలీ చేపట్టారు.ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, తెరాస శ్రేణులు పాల్గొన్నారు.

బీఎస్ఎన్ఎల్ కార్యాలయం
బీఎస్ఎన్ఎల్ కార్యాలయం
author img

By

Published : Jun 18, 2022, 5:29 PM IST

తెలంగాణలో రాకేశ్‌​ అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత.. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై దాడి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన అల్లర్లలో మృతిచెందిన తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా యువకుడు రాకేశ్‌ మృతదేహంతో భారీ ర్యాలీ చేపట్టారు. రాకేశ్‌ మృతదేహం ఉన్న వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి నుంచి నర్సంపేట వరకు ఈ అంతిమ యాత్ర సాగింది. ర్యాలీలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, తెరాస శ్రేణులు పాల్గొన్నారు.

ర్యాలీలో భాగంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరంగల్‌ పట్టణ పరిధిలోని పోచంమైదాన్ కూడలి వద్ద పలువురు ఆందోళనకారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇవీ చూడండి..

'అగ్నిపథ్​' నిరసనలతో ఆగిన ట్రైన్​​​.. వ్యక్తి మృతి.. రైలులోనే మహిళ ప్రసవం

పాము, శునకం మధ్య భీకర పోరు.. చివరకు రెండు మూగజీవాలు..!

స్విమ్మింగ్​ పూల్​లో శ్రీముఖి.. తడి అందాలతో కవ్విస్తూ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.