ETV Bharat / city

IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ - ias-officers-in-ap

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ

author img

By

Published : Apr 3, 2022, 1:05 AM IST

Updated : Apr 3, 2022, 10:34 AM IST

01:01 April 03

రవాణాశాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌

IAS Officers Transfers: కొత్త జిల్లాల మార్పుచేర్పులుతో పాటు రాష్ట్రంలోని అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన పోస్టింగ్​లలో అధికారులను బదిలి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రవాణా శాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను, సీఆర్‌డీఏ కమిషనర్‌గా వివేక్‌ యాదవ్‌ను, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌గా చేవూరి హరికిరణ్‌ను, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా జె.నివాస్‌ను, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా కె.ఆర్‌.బిహెచ్‌.ఎన్‌.చక్రవర్తిని నియమించింది.

దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జి.వాణీమోహన్‌ను యువజన వ్యవహారాలు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా హరిజవహర్‌లాల్‌, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా వీరపాండ్యన్‌కు అదనపు బాధ్యతలు అప్పగింది. నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా జాహ్నవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌గా చేతన్​ను బదిలీ చేశారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా కీర్తిని నియమించారు.
పోలవరం పరిపాలన అధికారిగా ప్రవీణ్‌ ఆదిత్యను పోస్టింగ్ ఇస్తూ.. ఉత్తర్వులు జారీచేశారు. రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నిశాంతిని నియమించారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్‌గా భార్గవ తేజాకు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీచేశారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా శిరీని నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా వివేక్ యాదవ్ కు పోస్టింగ్ ఇచ్చారు. ఈఎమ్‌సీ సీఈవోగా గౌతమిని నియమించారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా బీఆర్‌ అంబేద్కర్ కు పోస్టింగ్ ఇచ్చారు. జీఏడీ సెక్రటరీగా అరుణ్‌కుమార్ కు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీపీఎస్‌ఈ సెక్రటరీగా అరుణ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌గా గందం చంద్రుడును నియమించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

Last Updated : Apr 3, 2022, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.