- పీఆర్సీపై చర్చించడానికి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం
పీఆర్సీ పై చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది. పీఆర్సీ సమస్యలపై మంత్రుల కమిటీతో చర్చించాలని....ఉద్యోగ సంఘాలకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ సమాచారం పంపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా నుంచి కోలుకున్న చంద్రబాబు..నేడు నిజనిర్థరణ కమిటీతో భేటీ..
ఈనెల 18న చంద్రబాబుకు కొవిడ్ నిర్ధరణ కాగా ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందారు. ఏడు రోజుల అనంతరం చంద్రబాబుకు మళ్లీ కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ గా ఫలితాలు వచ్చాయి. ఆయన కరోనా బారి నుంచి కోలుకున్నారు.తిరిగి చంద్రబాబు తన విధుల్లో నిమగ్నంకానున్నారు. నేడు నిజనిర్థరణ కమిటీ సభ్యులతో తన నివాసంలో మధ్యాహ్నం భేటీ కానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- విశాఖలో గంజాయి ముఠా బీభత్సం..కారును వదిలి, చెరువులోకి దూకి..పోలీసులకు చిక్కిన స్మగ్లర్లు
విశాఖ జిల్లా నర్సీపట్నంలో గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా కారును గుర్తించిన ట్రాఫిక్ ఎస్‌ఐ ఆ వాహనాన్ని వెంబడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నల్లమల అటవీ దారిలో పులి ప్రత్యక్షం...లారీకి అడ్డుగా వచ్చిన క్రూరమృగం..
నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంనకు వెళ్లే దారిలో పెద్దపులి కనిపించింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్లకు లారీలో సరుకులు తీసుకొని వెళ్తున్న కొందరికి పెద్ద పులి కనిపించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- పెరిగిన మరణాలు
భారత్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో 2,55,874 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులో 614 మంది మరణించారు. 2,67,753 మంది కొవిడ్‌ను జయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నా భర్త నన్ను కొడతారు.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు: యూపీ మంత్రి
సొంత భర్తే తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, శారీరకంగా వేధిస్తున్నాడని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహిళా మంత్రి వాపోయింది. అయితే.. ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు మంత్రి స్వాతి సింగ్. ఈ ఆడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బడా నేతల సేఫ్ గేమ్.. కంచుకోటల నుంచే పోటీ!
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల బడా నేతలంతా.. తమకు పూర్తిగా పట్టున్న స్థానాలనే ఎంపిక చేసుకున్నారు. విజయంపై ధీమా ఉన్న సీట్ల నుంచే వారు బరిలో దిగుతున్నారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ బడా నేతలది ఇదే తీరు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అమెరికా విశ్వవిద్యాలయంలో 'కులం' నిబంధన కలకలం
అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 'కులం' నిబంధన వివాదానికి దారి తీసింది. అణచివేతకు గురయ్యే విద్యార్థులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తూ.. తమ వివక్ష వ్యతిరేక విధానంలో 'కులం' నిబంధనను విశ్వవిద్యాలయం జోడించింది. అయితే, దీనిని కొంతమంది అధ్యాపక సిబ్బంది వ్యతిరేకించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- స్టేడియం బయట తొక్కిసలాట- ఆరుగురు మృతి
ఓ ఫుట్‌బాల్ స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. అనేకమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మెగాస్టార్ సరసన త్రిష.. 16ఏళ్ల తర్వాత మళ్లీ..!
మెగాస్టార్ చిరంజీవి సరసన నటించేందుకు త్రిష.. మరోసారి ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు చేస్తున్న సినిమాలో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి