- ఇద్దరు ఏపీ ఎంపీలకు కరోనా పాజిటివ్
పార్లమెంట్ లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏపీకి చెందిన ఇద్దరు ఎంపీలకు పాజిటివ్ అని తేలింది. వీరిలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఉన్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- దరఖాస్తు గడువు పెంపు..
ఏపీ ఎంసెట్ సహా నాలుగు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు పెంచారు. అపరాధ రుసుముతో గడువును పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం కోసం లింక్ క్లిక్ చేయండి
- కొనసాగుతున్న వరద...
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,22,217 క్యూసెక్కులు కాగా...5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- ప్రధానికి ఉపకులపతుల లేఖ...
దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన విద్యావిధానంలో లోపాలున్నాయంటూ 20 మంది ఉపకులపతులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వివరణాత్మక లేఖ రాశారు. ఈ విధానం వల్ల విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటారని తెలిపారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- కొట్టుకుపోయిన కారు
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో వరద ఉద్ధృతికి నదిలో ఓ కారు కొట్టుకుపోయింది. మూడు కార్లు కొట్టుకుపోతుండగా... రెండు కార్లను ఒడ్డుకు లాగారు స్థానికులు. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల మరో కారు చూస్తుండగానే మునిగిపోయింది. వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి...
- అంతకంతకూ పెరుగుతున్నాయి...
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా 92,071 మందికి వైరస్ సోకింది. మరో 1,136 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం కేసులు సంఖ్య 48 లక్షల 46 వేలు దాటింది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- కరోనా విలయం..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం నాటికి 2.40 లక్షలకుపైగా కొత్తగా వైరస్‌బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 91 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 2 కోట్ల 10 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. భారత్, అమెరికాలో ఉద్ధృతి కొనసాగుతోంది. బ్రెజిల్, రష్యాల్లో తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- మరో భారీ పెట్టుబడి!
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోకి మరో భారీ పెట్టుబడి రానున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో.. కార్లైల్ గ్రూప్ దాదాపు 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
'సిసింద్రీ' అల్లరికి పాతికేళ్లు
ఇంట్లోనే చిన్నపిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు ముద్దుగా సిసింద్రీ అని పిలుచుకుంటారు. అల్లారుముద్దుగా పెంచుకున్న వారి కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేస్తే తల్లి మనసు ఎంత గాయపడుతుందో కదా. ఇదే కథాంశంతో 25 ఏళ్ల క్రితం తీసిన చిత్రం 'సిసింద్రీ'. దీనితోనే బాలనటుడిగా పరిచయమయ్యాడు అఖిల్ అక్కినేని. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- ఆ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం
రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ గెలిచింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. 1-1 తో సిరీస్ సమమైంది. దీంతో బుధవారం జరిగే మూడో వన్డేలో విజయం సాధించిన జట్టు, సిరీస్ సొంతం చేసుకుంటుంది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...