- తణుకులో ఉద్రిక్తత.. అమరావతి అనుకూల, వ్యతిరేక నినాదాలు
అమరావతి రైతులు గాంధేయమార్గంలో శాంతియుతంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మూడు రాజధానులకు మద్దతుగా నరేంద్ర కూడలిలో వైకాపా బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
- వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లతో ఎన్నో ప్రయోజనాలు : సీఎం జగన్
వచ్చే వేసవిలో విద్యుత్ కొరత లేకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైన బొగ్గును సమకూర్చుకుని దేశీయంగా విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
- వైకాపా మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు: చంద్రబాబు
ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైకాపాకు వ్యతిరేకంగా పోరాడాలని తెదేపా నేతలను చంద్రబాబు సూచించారు. మరోవైపు విశాఖలో తన ఆస్తులపై విజయసాయిరెడ్డి వివరణపై తెదేపా నేతల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
- ఏదో కుట్ర జరుగుతోంది.. ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానం కలుగుతుందని వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న డ్రైవర్ దస్తగిరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
- ప్రభుత్వ గ్యాస్ సంస్థలకు కేంద్రం రూ.22వేల కోట్ల సాయం.. వారికి దీపావళి బోనస్
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మూడు గ్యాస్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. 2020 నుంచి 2022 మధ్యలో అసలు ధరకన్నా తక్కువకే సిలిండర్లు విక్రయించి నష్టాలు మూటగట్టుకున్న ఈ సంస్థలకు రూ.22 వేల కోట్లు గ్రాంటు ప్రకటించింది.
- 'వారిని చంపి, వండుకుని తినేసిన భార్యాభర్తలు!'.. నరబలి కేసులో షాకింగ్ నిజాలు
సిరిసంపదల ఆశతో ఇద్దరి మహిళల్ని బలి ఇచ్చిన కేసులో మరిన్ని దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతుల శరీర భాగాల్ని నిందితులు వండుకుని తిన్నట్లు తెలిసింది. మరికొందరిని ఇదే తరహాలో నరబలి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వెల్లడైంది.
- పాపం.. ఒకేసారి 477 తిమింగలాలు మృతి
రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో 200కిపైగా పైలట్ తిమింగలాలు మరణించిన ఘటన మరువక ముందే న్యూజిలాండ్‌లో కూడా ఈ తరహా ఘటనే జరిగింది. న్యూజిలాండ్‌లోని మారుమూల బీచ్‌లలో చిక్కుకుపోయి 477 పైలట్ తిమింగలాలు ప్రాణాలు కోల్పోయాయి.
- పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. పడకేసిన పారిశ్రామిక ప్రగతి!
రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో కాస్త పెరిగింది. ఆగస్టులో ఏడు శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. తాజాగా 7.41 శాతానికి చేరింది. మరోవైపు, ఏడు కీలక రంగాల ప్రగతిని సూచించే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 0.8శాతం క్షీణించింది.
- రెజ్లర్ సుశీల్‌కు బిగుస్తున్న ఉచ్చు.. హత్య, హత్యాయత్నం కింద అభియోగాలు
హత్య కేసులో అరెస్టయిన ఒలింపిక్ విజేత రెజ్లర్ సుశీల్ కుమార్‌పై దిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. హత్య, హత్యాయత్నంతో పాటు పలు అభియోగాలను మోపింది.
- మహిళా కమిషన్ చీఫ్‌కు రేప్ వార్నింగ్.. 'ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ను బహిష్కరించండి'
హిందీ బిగ్‌బాస్ 16 కంటెస్టంట్ సాజిద్ ఖాన్‌పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాజాగా అతడిపై దిల్లీ మహిళ కమిషన్ చీఫ్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను రేప్ చేస్తామంటూ దుండగులు బెదిరిస్తున్నారు.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ న్యూస్ అప్డేట్
ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు
top news