- "అడిగింది ఉండదు.. ఇచ్చిందే తీసుకో".. ఇదే మద్యం విధానం
Few Brands in Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణాలు కొన్ని బ్రాండ్లకే పరిమితమవుతున్నాయి. వాటిలో వినియోగదారులు కోరుకునేవి దొరకవు. ప్రభుత్వం అమ్మేవే కొనాలి. వైకాపా అధికారంలోకి వచ్చాక అనుమతులు పొందిన కొన్ని బ్రాండ్లు, ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులకు సన్నిహితులవనే ప్రచారమున్న కంపెనీలు సరఫరా చేసే బ్రాండ్ల మద్యమే ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- MP RRR: కావాలంటే పార్టీ నుంచి బహిష్కరించండి.. అంతేకానీ
వైకాపా ప్రభుత్వాన్ని ఎంపీ రఘురామ హెచ్చరించారు. జులై 4న భీమవరంలో జరుగనున్న ప్రధాని సభలో తనను అరెస్టు చేయటానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. అక్కడ పిచ్చివేషాలకు పాల్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Polavaram: డయాఫ్రం వాల్ సామర్థ్య పరీక్షలపై భరోసా.. ఎన్‌హెచ్‌పీసీ నిపుణుల హామీ
Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్ సామర్థ్యం పరీక్షించడం సాధ్యమేనని.. జాతీయ హైడ్రో పవర్ కంపెనీ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణులు తేల్చారు. ఈ వాల్ సామర్థ్యాన్ని మూడు, నాలుగు రకాల పరీక్షలతో నిర్ధారిస్తామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Accident: తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట వద్ద కారు ప్రమాదం.. ముగ్గురు మృతి
రాజమహేంద్రవరం గ్రామీణ మండలం హుకుంపేట వద్ద ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు ధవళేశ్వరానికి చెందిన జయదేవ్ గణేష్, వెంకటేష్‌గా గుర్తించారు.
- 31 శాతం రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు
రాజ్యసభ సభ్యుల్లో 31 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ నివేదిక వెల్లడించింది. అందులోనూ 16 శాతం మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు.. 87 శాతం కోటీశ్వరులుగా తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో రెండు కొవిడ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి
DCGI approval: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మరో రెండు కొవిడ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. దేశీయంగా తయారైన ఎంఆర్ఎన్ఏ సహా 7-11 ఏళ్ల చిన్నారులకు కొవొవాక్స్ టికాలకు అనుమతులు లభించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
Disease X News: ప్రపంచ దేశాలను వరుస అంటువ్యాధులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్, మంకీపాక్స్ వంటి వ్యాధులు ప్రబలంగా విస్తరిస్తోన్న వేళ.. రానున్న రోజుల్లో డిసీజ్ ఎక్స్ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచివుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సోషల్ మీడియాలో వచ్చిందే వాస్తవం'.. 87% భారతీయుల్లో ఇదే వైఖరి
పుస్తకాలు, పత్రికల కన్నా సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్నే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ సర్వే వెల్లడించింది. భారత్‌లో 87శాతం మంది సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్నే నమ్ముతున్నారని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం.. బెంబేలెత్తించిన ఐర్లాండ్
Ind vs Ireland: ఐర్లాండ్‌తో తొలి టీ20లో విజయం సాధించిన టీమ్ఇండియా.. రెండో టీ20ని కూడా సొంతం చేసుకుని సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. కానీ 225 పరుగుల భారీ స్కోరు చేసినా గెలుపు అంత తేలిగ్గా దక్కలేదు. పేరుకు చిన్న జట్టే అయినా గొప్పగా పోరాడిన ఐర్లాండ్.. అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించినంత పని చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Alia: 'నేను పార్సిల్ కాదు.. మహిళను.. ఆ ఆలోచనలు మానుకోండి'
Alibhatt pregnancy: బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ ఫైర్ అయింది. పాతకాలపు ఆలోచనల నుంచి బయటకురావాలని హితవు పలికింది. మహిళలు ఇంకా పితృస్వామ్య సమాజంలోనే బతకాల్సి రావడం బాధాకరమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.