ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ap news

.

TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 27, 2022, 10:59 AM IST

  • నేడు అమ్మఒడి నిధుల జమ.. బటన్ నొక్కనున్న సీఎం జగన్
    CM Jagan Srikakulam Tour: సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా.. ఆయన జిల్లాకు చేరుకున్నారు. నవరత్నాల్లో భాగంగా వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మఒడి పథకానికి.. ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మఒడి పథకం ద్వారా 2 లక్షల 150 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • TTD: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా.. విడుదల చేసిన తితిదే
    TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను.. తితిదే విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 29 వరకు టికెట్ల నమోదుకు అవకాశం కల్పించిన తితిదే.. జూన్ 29న మధ్యాహ్నం 12 తర్వాత వెబ్‌సైట్‌లో లక్కీడిప్‌ టికెట్లను విడుదల చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • జులై 5 నుంచి మోగనున్న బడిగంట.. అకడమిక్‌ కేలండర్‌ రిలీజ్
    రాష్ట్రంలోని పాఠశాలలు జులై 5 నుంచి పునఃప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు ప్రతి ఏడాది జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమై ఏప్రిల్‌ 23వరకు కొనసాగేవి. ఈ ఏడాది పునఃప్రారంభ సమయాన్ని మార్చేశారు. జులై ఐదో తేదీకి తీసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Rains: తెలంగాణలో చిరు జల్లులు
    Telangana Rains Today : రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మరో 17వేల మందికి వైరస్​
    Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 17,073 మందికి వైరస్​ సోకింది. మరో 21 మంది చనిపోయారు. 15,208 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • తీస్తాకు జులై 2 వరకు పోలీసు కస్టడీ.. కేసు విచారణకు సిట్​
    ఫోర్జరీ, నేరపూరిత కుట్ర తదితర ఆరోపణలపై ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ను అరెస్ట్​ చేసినట్లు ప్రకటించారు పోలీసులు. న్యాయస్థానంలో హాజరుపరచగా.. తీస్తాతో పాటు మాజీ డీజీపీ శ్రీకుమార్​ను జులై రెండు వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది కోర్టు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు తీస్తా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బుల్​ఫైట్​లో కుప్పకూలిన స్టాండ్​.. నలుగురు మృతి.. వందల మందికి గాయాలు
    Mexican cartel violence: డ్రగ్స్​ గ్యాంగ్​ చేసిన మెరుపుదాడిలో ఆరుగురు పోలీసులు మరణించగా..నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మెక్సికోలోని న్యువో లియోన్​లో జరిగింది. మరో ఘటనలో కొలంబియాలో ఎద్దుల పోటీలను చూస్తుండగా.. స్టాండ్​ కూలి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • స్టాక్​ మార్కెట్లోకి తొలి అడుగు.. 'సూచీ ఫండ్ల'తో మేలు!
    Index Funds: మీరు మొదటిసారిగా స్టాక్​ మార్కెట్లో అడుగుపెట్టాలనుకుంటున్నారా? ఏం చేయాలో, ఎటువంటి మార్గం అనుసరించాలో డౌట్​గా ఉందా?.. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడుల ప్రయాణంలో తొలి అడుగు వేయటానికి 'ఇండెక్స్‌ ఫండ్స్‌' (సూచీ ఫండ్లు)ను పరిగణనలోకి తీసుకోవటమే సరైన నిర్ణయం. అయితే సూచీఫండ్లకు సంబంధించిన వివరాలు, ప్రత్యేకతలు, పథకాలు తెలుసుకుందాం రండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • IRE vs IND: తొలి టీ20లో ఐర్లాండ్‌పై భారత్​ ఘనవిజయం
    Ind vs Ireland: ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆతిథ్య జట్టు విసిరిన 108 పరుగుల లక్ష్యాన్ని టీమ్​ఇండియా అలవోకగా ఛేదించి సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మంగళవారం జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పవన్​, బన్నీ, తారక్​.. ఎందుకు ఇన్ని డౌట్లు పెడుతున్నారు?
    పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. తమ హీరోలు చేస్తున్న సినిమాల విషయంలో స్పష్టత కొరవడటమే అందుకు కారణం. తమ హీరోలు చేసే ఏ సినిమా ఎప్పుడు వస్తుంది? అసలు ప్రకటించిన సినిమాలు పట్టాలెక్కుతాయా లేదా అనే అనుమానం నెలకొంది! మరి వీటికి సమాధానం కాలమే చెప్పాలి!! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.