- ఉగాది నుంచి కొత్త జిల్లాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఉగాది నుంచి కొత్త జిల్లాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కర్నూలు జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట వద్ద ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న కారు బావిలో పడింది. సహయ సిబ్బంది ఒక మృతదేహం వెలికితీశారు. కారులో మరికొందరు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సినిమా పరిశ్రమ విశాఖ రావాలి.. తెలంగాణకన్నా ఏపీ సహకారమే ఎక్కువ : జగన్
సినిమా పరిశ్రమ విషయంలో మంచి పాలసీ తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందని సీఎం జగన్ అన్నారు. ఆ పాలసీ ద్వారా పెద్ద, చిన్న సినిమాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గత కొద్దికాలంగా కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- AP Corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,345 కరోనా కేసులు, 4 మరణాలు
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 26,393 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా..1,345 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 6,576 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 40,884 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- హిజాబ్, కాషాయ దుస్తులు ధరించొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా విద్యార్థులు ఎవరూ మతపరమైన దుస్తులు(హిజాబ్, కాషాయ కండువాలు) ధరించొద్దని ఆదేశించింది. శుక్రవారమే విద్యా సంస్థలను తెరవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భాజపాలోకి 'ది గ్రేట్ ఖలీ'... మోదీ సర్కారు విధానాలు నచ్చి...
ప్రముఖ ప్రొఫెషనల్ రెజ్లర్ 'ది గ్రేట్ ఖలీ' భాజపా తీర్థం పుచ్చుకున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన భాజపాలోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా రెజ్లర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పట్టపగలే మహిళల ఖతర్నాక్ చోరీ- క్షణాల్లో బంగారం బాక్స్ మాయం
మహారాష్ట్ర నాసిక్ జిల్లా సరాఫ్ బజార్లో ముగ్గురు మహిళలు పట్టపగలే బంగారం చోరీ చేశారు. యజమానికి ఉండగానే రూ.4.5 లక్షలు విలువ చేసే బంగారాన్ని కొట్టేశారు. సీసీటీవీ కెమెరా దృశ్యాలు చూశాక యజమానికి చోరీ జరిగిందన్న విషయం తెలిసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అమ్మాయి పుడుతుందని డౌట్.. అబ్బాయిలా మార్చేస్తానని గర్భవతి తలకు మేకు!
ఆమెకు ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు. నాలుగో కాన్పులోనూ అమ్మాయే పుడుతుందని అనుమానం. అదే జరిగితే భర్త వదిలేస్తాడని భయం. అందుకే ఓ నకిలీ బాబాను ఆశ్రయించింది. అతడి సలహాతో తలకు రెండు అంగుళాల మేకు కొట్టించుకుని ప్రాణం మీదకు తెచ్చుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- IPL 2022: కొత్త జెర్సీలు, స్పాన్సర్లతో ఫ్రాంఛైజీలు!
ఐపీఎల్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన నిర్వహణ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. మరో రెండు రోజుల్లో (12,13 తేదీల్లో) మెగావేలం జరగనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సమంత సినిమాలో క్రికెటర్ శ్రీశాంత్.. రిలీజ్ డేట్‌తో 'పృథ్వీరాజ్'
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో విజయ్‌సేతుపతి, సమంత, అక్షయ్‌కుమార్, యామీ గౌతమ్, మాధురీదీక్షిత్ చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి