ETV Bharat / city

ప్రధాన వార్తలు @9AM - ఏపీ ప్రధాన వార్తలు

.

top news
top news
author img

By

Published : May 14, 2021, 8:52 AM IST

  • ఎస్కార్ట్ వాహనం మీదకు దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు పోలీసులు మృతి

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ‌ తిమ్మాపురం పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్నహెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్.ఎస్.రెడ్డిలపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో లారీ బీభత్సం సృష్టించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ‘ప్రాణవాయువు రథచక్రాలు’ వచ్చేశాయ్‌!

ప్రభుత్వాసుపత్రిలో బెడ్లకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన ‘ఆక్సిజన్‌ పడకల ఆర్టీసీ బస్సులు’ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి. ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ పేరిట సిద్ధం చేసిన రెండు బస్సులను రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ గురువారం ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఆ కొవిడ్ వార్డులో ఆభరణాలు మాయం.. పోలీసులతో బాధితుల వాగ్వివాదం

కొవిడ్ వార్డులో ఆభరణాలు మాయమైన ఘటన విశాఖ నగర పరిధిలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. స్థానిక సీఎస్​ఆర్​ బ్లాకులోని కరోనా చికిత్స గదిలో ఈ కలకలం జరిగింది. ఈ మేరకు మృతదేహాల నుంచి బంగారు ఆభరణాలు అదృశ్యమవుతున్నాయని సంబంధిత కుటుంబీకులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'ఆ అధికారం రాష్ట్రాలకు ఇవ్వండి'

ఎస్​ఈబీసీ రిజర్వేషన్ల జాబితాలో కొత్తవాటిని చేర్చడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంను కోరింది. ఈ మేరకు గురువారం రివ్యూ పిటిషన్​ను దాఖలు చేసింది. రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కోలుకున్న వారిలోనూ.. కొత్త ముప్పు

బ్లాక్ ఫంగస్‌ శరీరంలోకి వ్యాపించిన రెండు మూడు రోజుల్లోనే ముఖభాగంలోని అవయవాలను కబళించేస్తుంది. తొలుత ముక్కులోపలి భాగంలో చేరి క్రమంగా కళ్లు, చెవులు, దవడలకు, తర్వాతి దశలో మెదడులోకి విస్తరిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అమెరికాలో ఇక మాస్క్​ లేకుండా తిరగొచ్చు!

కరోనా టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఇకపై మాస్కు అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకటించింది. కొవిడ్​-19 రెండు డోసులు తీసుకున్నవారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని సీడీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కరోనా టీకా వేయించుకుంటే లాటరీ..!

కరోనా నేపథ్యంలో అపోహలతో టీకాలు వేయించుకోని ప్రజలను ఒప్పించడానికి అమెరికాలోని ఒహైయె రాష్ట్ర సర్కారు ఆకర్షణీయమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. టీకా వేయించుకున్నవారిలో అదృష్టవంతులకు ప్రతి వారం 1 మిలియన్‌ డాలర్లు (రూ.7.3కోట్లు) బహుమానంగా ఇస్తామని ట్వీట్‌ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • టీకాల తయారీకి 'లుపిన్‌' సన్నాహాలు

దేశంలో కరోనా ఔషధాలకు ప్రాధాన్యం ఏర్పడిన వేళ.. వాటిని అందించేందుకు దేశీయ ప్రముఖ ఔషధ కంపెనీ లుపిన్​ లిమిటెడ్​ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం విదేశీ భాగస్వామ్యాల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఆ సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఒలింపిక్స్​ ఆశలు వదులుకోలేదు: శ్రీకాంత్​

టోక్యో ఒలింపిక్స్​పై ఆశలు వదులుకోలేదని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్​ కిదాంబి శ్రీకాంత్​ తెలిపాడు. కరోనా కారణంగా అర్హత టోర్నీలు రద్దైనప్పటికీ.. ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'నా తప్పులు బయటపడ్డాయి.. త్వరలో తెరంగేట్రం'

తనపై వచ్చిన క్యాస్టింగ్ కౌచ్, ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణలపై స్పందించాడు నటుడు రానా సోదరుడు అభిరామ్. తప్పులు అందరూ చేస్తుంటారని.. కాకపోతే తన తప్పులు బయటకు వచ్చాయని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.