ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఏపీ ముఖ్యవార్తలు

.

top news
ప్రధాన వార్తలు @9PM
author img

By

Published : Jun 30, 2020, 8:58 PM IST

  • కొత్త 108, 104 వాహనాలను రేపు ప్రారంభించనున్న సీఎం

ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెస్తున్న 108, 104 వాహనాలను సీఎం జగన్​ రేపు ప్రారంభించనున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వైఎస్సార్ తెచ్చిన 108, 104 సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆయన అన్నారు. ప్రతి మండలంలో ఒక 108, 104 వాహనం అందుబాటులో ఉంటాయని మంత్రి చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్...ఇద్దరు మృతి

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరువక ముందే మరో గ్యాస్ లీకేజీ ప్రమాద ఘటన విషాదం నింపింది. పరవాడ ఫార్మా సిటీలో రసాయన వాయువు ఇద్దరి ఆయువు తీసింది. వెంటనే సిబ్బంది లీకేజ్​ను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాద తీవ్రతను కట్టడి చేయగలిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉద్యోగినిపై అధికారి దాడి: నిందితునిపై నిర్భయ కేసు

నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో ఉద్యోగినిపై దాడికి పాల్పడిన భాస్కర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిర్భయ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్​... భాస్కర్​ను సస్పెండ్​ చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో కొత్తగా 704 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 704 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,595కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మరో 5 నెలలు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ'

జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. "ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన"ను నవంబర్​ చివరి వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో 80కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందుతారని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​లో 4.5 కోట్ల మంది మహిళలు మిస్సింగ్​!

ప్రపంచవ్యాప్తంగా గడిచిన యాభై ఎళ్లలో 14.26 కోట్ల మంది మహిళలు కనిపించకుండా పోతే.. అందులో మూడో వంతు భారత్​లోనే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 50 ఏళ్లలో సుమారు 4.58 కోట్ల మంది కనిపించకుండా పోయారని లెక్కగట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'పెట్టుబడుల పేరుతో 'చైనా దొంగాట'పై దర్యాప్తు!'

చైనా వస్తువులను బహిష్కరించాలని కోరుతోన్న అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ).. భారత అంకురాల్లో చైనా పెట్టుబడులపైనా దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దేశీయ స్టార్టప్​ల సమాచారం చైనా పెట్టుబడిదారులకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తూ.. కేంద్రం ఆర్థిక, వాణిజ్య, ఐటీ శాఖలకు లేఖలు రాసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'పాకిస్థాన్​ ఆటగాళ్లకు భారత్​ ఎప్పుడూ సురక్షితమే'

పాకిస్థాన్ జట్టు వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ కోసం భారత్​కు వస్తే భద్రత పెద్ద సమస్య కాదని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా తెలిపాడు. భారత్​లో పర్యటన కోసం బీసీసీఐ నుంచి లిఖిత పూర్వక హామీ ఇప్పించాలని ఇటీవలే పాక్​ క్రికెట్​ పోర్డు ఐసీసీని కోరిన నేపథ్యంలో చోప్రా ఈ వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆమిర్ ​ఖాన్​ ఇంట్లో కరోనా కలకలం

తన సిబ్బందిలో కొంతమందికి కరోనా సోకిందని బాలీవుడ్​ హీరో ఆమిర్​ ఖాన్​ ఇన్​స్టా వేదికగా తెలిపారు. ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్​లో ఉంచినట్లు స్పష్టం చేశారు. తనతో పాటు, మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సూర్యవంశీ', '83' విడుదలపై క్లారిటీ

అక్షయ్ కుమార్ సూర్యవంశీ, రణ్​వీర్ సింగ్ 83 చిత్రాల విడుదల తేదీలపై ఓ క్లారటీ వచ్చింది. సూర్యవంశీ దీపావళికి, 83 క్రిస్మస్​ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.