- Protest: అక్కిరెడ్డిగూడెంలో స్థానికుల ఆందోళన.. పోలీసుల బందోబస్తు
Protest at akkireddygudem: ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగగా.. సిబ్బంది, స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామ శివారులో రోడ్డుకు అడ్డంగా ముళ్లకంపలు వేసి రాకపోకలను అడ్డుకున్నారు. ఘటనలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
- ఏలూరు అగ్నిప్రమాదం: బాధితుల పరిస్థితి విషమంగా ఉంది: జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం ప్రమాదంలో గాయపడిన బాధితుల పరిస్థితి.. విషమంగా ఉందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు. గాయపడిన 12 మందిలో ఒకరు మినహా మిగిలిన వారందిరికీ 70 శాతానికిపైగా కాలిన గాయాలయ్యాయన్నారు. వీరందిరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్న సూపరింటెండెంట్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
- Dr. B.R.Ambedkar: అంబేడ్కర్ భావాలకు మరణం లేదు: సీఎం జగన్
CM Jagan Tributes to Ambedkar: భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా ఆయనకు నివాళులు అర్పించారు.
- Dr. B.R. Ambedkar: 'అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ స్థాపనకు పునరంకితమవుదాం'
Tributes To Ambedkar: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ నివాళులు అర్పించారు.
- Fake Certificates: విదేశాల్లో ఉద్యోగాలకు నకిలీ పత్రాలు.. విజయవాడలో మూలాలు
Fake Certificates for Abroad Jobs : విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇచ్చి యూఎస్ ఎంబసీ అధికారులను మోసం చేసిన ఘటన దేశ రాజధానిలో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ వ్యవహారానికి సంబంధించిన మూలాలు విజయవాడలో బయటపడటం కలకలం రేపింది.
- దేశంలో మరో 1,007 కరోనా కేసులు.. ఒకరు మృతి
Covid Cases in India: దేశంలో కొత్తగా 1007 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోగా, 818 మంది కోలుకున్నారు. మరోవైపు బుధవారం దేశవ్యాప్తంగా 14,48,876 టీకాలను కేంద్రం పంపిణీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 978,703 మందికి వైరస్ సోకింది.
- ఉక్రెయిన్‌కు అమెరికా సాయం.. భారీ మిలిటరీ ప్యాకేజ్‌ను ప్రకటించిన బైడెన్
US aid to Ukraine: ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు కొత్తగా 800 మిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆమోదించారు. ఈ ప్యాకేజీలో ఉక్రెయిన్‌కు అవసరమైన అత్యంత ప్రభావంతమైన సాయుధ వ్యవస్థలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, బైడెన్ ప్రకటించిన ఈ భారీ సాయానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు.
- స్వల్పంగా పెరిగిన బంగారం రేటు.. క్రిప్టో కరెన్సీ ధరలు ఇలా..
Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. రూ.170 మేర వృద్ధి చెందింది. మరోవైపు, అంతర్జాతీయంగా క్రిప్టోకరెన్సీ ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి మారకం వంటి వివరాలు ఇలా ఉన్నాయి..
- దీపక్ చాహర్ గాయం తీవ్రం.. టీ20 వరల్డ్ కప్ కూడానా?
Deepak Chahar IPL 2022: వెన్నునొప్పి కారణంగా ఇప్పటికే ఐపీఎల్ 15వ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన బౌలర్ దీపక్ చాహర్. తాజా సమాచారం ప్రకారం గాయం తీవ్రమవటం వల్ల మరో నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడని తెలుస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు సైతం చాహర్ దూరమవుతాడనే వాదనలు వినిపిస్తున్నాయి.
- ఆలియా- రణ్‌బీర్ వెడ్డింగ్ వైబ్స్.. సెలబ్రిటీల సందడి!
Alia ranbir kapoor marriage: బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరి కొన్ని గంటల్లో వీరి పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై సందడి చేస్తున్నారు.