- Sivarathri Celebrations: రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు... ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు
Sivarathri Celebrations : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. పరమేశ్వరుని అభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శివ నామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి.
- ఉక్రెయిన్‌లో బాంబుల మోత.. విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో దడ
AP students at Ukraine: ఉక్రెయిన్‌పై.. రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న వేళ..అక్కడ చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. భయానక పరిస్థితుల మధ్య బంకర్లలో తలదాచుకుంటున్న తమను.. స్వదేశానికి రప్పించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల్ని క్షేమంగా స్వస్థలాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
- CHANDRABABU: 'ప్రతేక విమానాల ద్వారా విద్యార్థులను తీసుకురావాలి'
CHANDRABABU: ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తరలించే విషయంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర విదేశాంగ శాఖ సాయం కోరారు. జెఫ్రోజియా నుంచి ట్రైన్లో బోర్డర్‌కు బయలుదేరిన 1,481 మంది విద్యార్థుల వివరాలకు కేంద్ర మంత్రి జైశంకర్‌కు పంపారు.
- దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- 7 వేల దిగువకు..
Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 6,915 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 180 మంది మృతి చెందారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 11,01,750 కేసులు వెలుగుచూశాయి.
- ప్రెసిడెంట్ పుతిన్ 'అణ్వస్త్రం' ప్రయోగిస్తారా?.. ఒకవేళ చేస్తే!
Nuclear dangers ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాన్ని ప్రయోగిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆదివారం.. రష్యా అణ్వస్త్ర దళాలకు పుతిన్ ఆదేశాలతో ఈ అనుమానం కలుగుతోంది. రష్యాను నాశనం చేయాలనుకునేవారిపై దీటుగా స్పందించే హక్కు తమకుందని నాలుగేళ్ల కిందటే పుతిన్ ప్రపంచాన్ని హెచ్చరించారు. ప్రస్తుత తరుణంలో అవకాశం లేదని.. కానీ కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- రష్యన్ బలగాల దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి!
ఉక్రెయిన్‌లోని కీవ్-ఖార్కివ్ మధ్య ఉన్న ఒఖ్తిర్కా మిలిటరీ బేస్‌పై రష్యన్ బలగాలు జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైనికాధికారి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను షేర్ చేశారు. ఇరు దేశాల బలగాల మధ్య ఆదివారం జరిగిన పోరులో ఎంతో మంది రష్యన్ సైనికులు సహా స్థానికులు కూడా మృతి చెందినట్లు తెలిపారు.
- ముగ్గురు పిల్లల్ని కాల్చి చంపి.. తండ్రి సూసైడ్
Man Kills 3 children: అమెరికా కాలిఫోర్నియాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి.. తన ముగ్గురు పిల్లలు సహా మరొకరిని కాల్చి చంపాడు. అనంతరం.. నిందితుడు కూడా గన్‌తో కాల్చుకొని చనిపోయాడు.
- Womens World cup 2022: ప్రపంచకప్.. మిథాలీ కల తీరేనా
Womens World cup 2022 Mithali Raj: మిథాలి రాజ్.. ప్రపంచ మహిళల క్రికెట్లో ఈ పేరు సంచలనం. తన ఈడువాళ్లంతా ఆటకు వీడ్కోలు పలికినా ఇంకా ఆటలోనే కొనసాగుతూ వర్ధమాన క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇప్పటివరకు కెరీర్లో ఎన్ని రికార్డులు సాధించిన ఆమెకు ఉన్న ఒకే ఒక్క లోటు ప్రపంచకప్ టైటిల్. మరి త్వరలోనే న్యూజిలాండ్ వేదికగా ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌లో ఈ సారైనా టైటిల్ సాధిస్తుందో లేదో చూడాలి.
- IND vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమ్ఇండియా జట్టు కూర్పు కుదిరేనా?
IND vs SL Test series Teamindia combination: భారత్ క్రికెట్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే శ్రీలంకతో ఆడిన టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ టీమ్ఇండియా మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్‌తోనే రోహిత్ శర్మ తొలిసారిగా టెస్టు ఫార్మాట్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను ఏఏ స్థానాల్లో బ్యాటింగ్‌కు దింపితే బాగుంటుందో చూద్దాం..
- శివరాత్రి స్పెషల్.. 'భోళాశంకర్' స్పెషల్ వీడియో రిలీజ్
chiranjeevi bholashankar update: శివరాత్రి సందర్భంగా భోళాశంకర్ చిత్రబృందం కొత్త అప్డేట్ను ఇచ్చింది. 'వైబ్ ఆఫ్ భోళా' పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇది ఆకట్టుకునేలా ఉంది.