- Anandaiah Medicine: 'ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదు'
కరోనా మందు ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదని కృష్ణపట్నం ఆనందయ్య అన్నారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధం అందిస్తామన్నారు. ఇవాళ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే ఔషధం అందిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ధూళిపాళ్లకు అనిశా నోటీసులు.. 'సంగం' కేసులో విచారణకు హాజరు
సంగం డెయిరీ కేసులో ఏసీబి విచారణకు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హాజరయ్యారు. ఈరోజు ఉదయం 9గంటలకు విజయవాడ ఏఆర్‌గ్రౌండ్‌లోని కార్యాలయానికి రావాలని ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్ర నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆమెతో పరిచయం ఖరీదు.. రూ.80 లక్షలు..!
డబ్బున్న వారే ఆమె టార్గెట్.. కన్సల్టెంట్ పేరుతో పరిచయం పెంచుకుంటుంది.. మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు దోచుకుంటుంది. ఆమే... కిలాడీ లేడీ శ్రీదివ్య. తాజాగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ వ్యక్తి నుంచి రూ.80 లక్షలు దోచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Cyber Crime: వాట్సాప్‌ను హ్యాక్ చేస్తారు.. మాయమాటలు చెప్పి దోచేస్తారు!
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో దోచేస్తున్నారు. కొత్తగా.. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అయిన వాట్సాప్‌నూ హ్యాక్ చేసి తెలిసినవారికి మాయమాటలు చెప్పి డబ్బు బదిలీ చేయించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Covid-19: దేశంలో మరో లక్ష కేసులు
భారత్‌లో కరోనా కేసులు (Covid-19) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,00,636 మందికి కొవిడ్ సోకింది. వైరస్ బారినపడి మరో 2,427 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Unlock: మెట్రో కూతలు.. బస్సుల పరుగులు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుతుండగా.. పలు రాష్ట్రాల్లో అన్‌లాక్(Unlock) ప్రక్రియ మొదలవుతోంది. రవాణా వ్యవస్థలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ముంబయిలోనూ బస్సు సౌకర్యాలు మొదలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెండు రైళ్లు ఢీ- 30మంది మృతి
పాకిస్థాన్‌లో రెండు ప్యాసెంజర్ రైళ్లు ఢీ కొన్న ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Petrol price: రికార్డు స్థాయికి చమురు ధరలు
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. ఈ నెలలో ధరలు పెరగటం ఇది నాలుగోసారి. తాజా పెరుగుదలతో దిల్లీలో పెట్రోల్ ధర సరికొత్త రికార్డు స్థాయి అయిన రూ.95.37 వద్దకు చేరింది. డీజిల్ ధర రూ.86.28 వద్ద ఉంది. ఇతర ప్రాంతాల్లోనూ ఇంధన ధరలు నూతన రికార్డు స్థాయిని తాకాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంతర్జాతీయ క్రికెట్ నుంచి రాబిన్సన్ సస్పెండ్
ఇంగ్లాండ్ బౌలర్ ఒల్లీ రాబిన్సన్(Ollie Robinson)ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది ఈసీబీ. 2012-13లో స్త్రీ వివక్ష, జాత్యంహకార సందేశాలు పెట్టడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Akhil: 'ఏజెంట్'కు తోడుగా కన్నడ యాక్టర్!
అక్కినేని అఖిల్-దర్శకుడు సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'ఏజెంట్'(Akhil Agent). ఇందులో ఓ కీలకపాత్ర కోసం కన్నడ నటుడు ఉపేంద్ర(Upendra)ను సంప్రదించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.