ETV Bharat / city

Top News: ప్రధాన వార్తలు @ 1 PM - అంతర్జాతీయ వార్తలు

ప్రధాన వార్తలు @ 1 PM

Top News @ 1 PM
Top News @ 1 PM
author img

By

Published : Jul 31, 2021, 1:05 PM IST

Updated : Jul 31, 2021, 1:11 PM IST

  • Chandrababu: 'దాడులకు భయపడం.. మాతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు'

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు తీరును తప్పుబట్టారు. తప్పు జరగకుంటే.. తమ పార్టీ నిజ నిర్ధరణ బృందాన్ని ఎందుకు కొండపల్లికి వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. దేవినేని ఉమా కుటుంబీకులను పరామర్శించిన చంద్రబాబు.. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • Tdp Fact Finding comity: నేడు కొండపల్లికి తెదేపా నిజనిర్ధరణ కమిటీ.. నేతల హౌజ్ అరెస్ట్

కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై తెదేపా నిజనిర్ధరణ కమిటీ ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన చేయనుంది. మొత్తం 10 మంది సభ్యుల కమిటీలో.. ఇప్పటికే పోలీసులు 8 మందిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • Srisailam: శ్రీశైలానికి 5.59 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం జలాశయంలో 10 గేట్లను... 20 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 5,59,057 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఉప్పొంగుతున్న నది- నిచ్చెన వేసి ప్రాణాలు కాపాడిన సిబ్బంది

హిమాచల్​ ప్రదేశ్​లో భీకర వర్షాలు కరుస్తున్నాయి. లాహౌల్​ స్పీతి ప్రాంతంలో జహల్​మన్​ కాలువ ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. దీంతో ఈ కాలువపై వంతెన కూలిపోగా.. ఓ గాయపడ్డ వ్యక్తిని కాలువ దాటించేందుకు స్థానికులు, సహాయక సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. కాలువపై ఓ నిచ్చెన ఏర్పాటు చేసి, తాడు సాయంతో కాలువ దాటించి, కేలాంగ్​కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • సరిహద్దులో పాక్ చొరబాటుదారుల​ హతం

ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) మట్టుబెట్టింది. పంజాబ్​లోని తర్న్​ తరణ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ ఘటన జరిగిందని ఓ అధికారి శనివారం తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • చైనా ఆర్మీలోకి టిబెట్‌ యువకులు

భారత సరిహద్దుల్లో ఉండే ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టిబెట్ యువతను తన సైన్యంలోకి చేర్చుకుంటోంది చైనా. వీరిని భారత సరిహద్దులో మోహరిస్తోంది. అదే సమయంలో టిబెట్‌ యువకుల్ని అన్ని విధాలా పరీక్షిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఇలాంటి క్రెడిట్‌ కార్డు తీసుకుంటే మీకే ఎక్కువ లాభం!

క్రెడిట్‌ కార్డుల వినియోగం ఈ మధ్య అధికమైంది. అయితే, మీరు బెస్ట్ క్రెడిట్ కార్డునే ఎంచుకుంటున్నారా? సాధారణంగా మనం బ్యాంక్‌ లేదా థర్డ్‌ పార్టీ కంపెనీలు ఏ కార్డుని ఆఫర్‌ చేస్తే ఆ కార్డునే తీసుకుంటుంటాం. కానీ, అది సరైన పద్ధతి కాదు. మీ అవసరం, వినియోగించే తీరును బట్టి కార్డును తీసుకోవాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • డిస్కస్​ త్రో ఫైనల్లో కమల్​ప్రీత్​.. ఆర్చరీ, బాక్సింగ్​లో నిరాశ

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు శనివారం ఉదయం నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. బాక్సింగ్​లో ప్రపంచ నెం.1, భారత ఫేవరేట్​ అమిత్​ పంగాల్​కు అనూహ్య ఓటమి ఎదురై.. నిష్క్రమించాడు. ఆర్చరీలో అతాను దాస్​కు నిరాశే ఎదురైంది. మహిళల డిస్కస్ త్రోలో.. కమల్​ప్రీత్​ కౌర్​ ఫైనల్​కు చేరడమే భారత్​కు సానుకూలాంశం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • హాకీలో టీమ్​ ఇండియా విక్టరీ- క్వార్టర్స్​ ఆశలు సజీవం

భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్​లో వరుసగా రెండో విజయం సాధించింది. పూల్​ ఏ లో శనివారం ఉదయం జరిగిన మ్యాచ్​లో సౌతాఫ్రికాపై 4-3 తేడాతో గెలిచి.. క్వార్టర్స్​ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • HBD Kiara Advani: కియారా అందాలు.. కళ్లు తిప్పుకోలేరు!

పాత్ర డిమాండ్​ చేయాలేగానీ ఎటువంటి సన్నివేశం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది కియారా అడ్వాణీ. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ అగ్రహీరోల సరసన నటిస్తూ స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. ఇటు వెండితెరపై అటు సోషల్​మీడియాలో హాట్​ అందాలతో కుర్రకారుల్ని ఫిదా చేస్తోంది. ఇవాళ(జులై 31) ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం... తెలుసుకోవాలంటే..ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Jul 31, 2021, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.