.భయమొద్దు... కరోనా చికిత్స చేయించుకునేందుకు మీరే ముందుకు రావాలి. వైరస్ పట్ల ప్రజల్లో భయం, ఆందోళన తొలగించాలని సీఎం జగన్ అన్నారు. కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్షించిన ఆయన...అధికారులకు పలు సూచనలు చేశారు. అవేంటో చూడండి..త్వరలోనే..ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించనున్నారు. గ్రామ స్థాయిలో రైతులకు.. వ్యవసాయ అనుబంధ శాఖల సేవలు అందేలా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. సంపూర్ణం..!రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. ఇప్పటికే 12 వందల దుకాణాలు రద్దు చేశామన్న ఆయన.. ఇంకా ఎన్ని మద్యం షాపులు రద్దు చేయాలనుకుంటున్నారో తెలుసా?సడలింపులు ఉంటాయా?లాక్‌డౌన్‌తో అన్ని రకాల సేవలు బంద్ కావడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా వివిధ రకాల సర్వీసింగ్ సెంటర్లు లేకపోవడంతో సెల్‌ఫోన్ల నుంచి ఇంట్లోని గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు సైతం మూలకు చేరుతున్నాయి. మరీ వాటికి గురించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో..?!నో కార్..ఆయన దాదాపు పదకొండు కోట్ల మందిని శాసిస్తున్న నాయకుడు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సీఎం తలచుకుంటే జరగని పనంటూ ఉండదు. కానీ... అలాంటి ముఖ్యమంత్రికి మాత్రం ఇప్పటి వరకు సొంత కారే లేదు! ఇంతకీ ఆ సీఎం ఎవరో తెలుసా?కీలక ఘట్టంకరోనా మహమ్మారి చికిత్స కోసం భారత్ చేపడుతున్న పరీక్షలు కీలక దశకు చేరుకున్నాయి. వైరస్ నియంత్రణకు యాంటీ-వైరల్ ఔషధం 'ఫవిపిరవిర్' క్లినికల్ ట్రయల్స్‌ను మూడో దశలో భాగంగా కరోనా రోగులపై చేయనున్నట్లు 'గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్' పేర్కొంది. డ్రగ్‌ను పరీక్షించేందుకు అనుమతులూ వచ్చేశాయ్..యాక్టివ్ప్రపంచంలో కొవిడ్-19 కేసుల సంఖ్యలో భారత్ 13వ స్థానంలో ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య విషయానికి వస్తే 8వ స్థానంలో ఉంది. భారత్‌లో కరోనా లాక్‌డౌన్ సడలింపులు, వలస కార్మికుల తరలింపు తదితర చర్యల నేపథ్యంలో వైరస్ తీవ్రత పెరిగి యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా అధికం కానుందనే ఆందోళన మొదలైందట..డౌటేనంటనోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యూఎస్, యూకే, జపాన్ లాంటి దేశాలు తమ జీడీపీలో అధిక శాతం ఖర్చు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ వాణిజ్యం చైనా చేజారినంత మాత్రాన అది భారత్‌కు లాభిస్తుందని కచ్చితంగా చెప్పలేమన్నారు.పోలీస్తో 'ఎస్పీ పరుశురాం'మానసిక పరిస్థితి సరిగా లేని వృద్ధురాలికి ఓ పోలీసు అధికారిణి అన్నం తినిపించే వీడియోను ఇటీవలే ట్విట్టర్లో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఒడిశాకు చెందిన పోలీసు అధికారిణి శుభశ్రీతో స్వయంగా మాట్లాడి.. తన మానవీయతకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు అధికారిణి చేసింది చాలా గొప్ప పని కదూ..భారత్ ప్లేయర్తోనా.. నో..నోకరోనా కారణంగా ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. కానీ ఈ లీగ్‌ను కేవలం భారత ఆటగాళ్లతోనే నిర్వహించే వీలుందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది. అలా అయితే మేం వ్యతిరేకమంటోంది. ఎందుకో తెలుసుకోండి.